ఇస్తాంబుల్ : టర్కీలోని ఇస్తాంబుల్‌లో గురువారం నాడు ఎనిమిది అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఆ భవనంలోని 14 అపార్టమెంట్లలో 43 మంది నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర బృందాలు శిథిలాలు వెలికితీత కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. భవనంలో మూడు అంతస్తులు అక్రమంగా నిర్మించినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ తెలిపారు. ఇది అకస్మాత్తుగా కూలడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు.
ఇస్తాంబుల్‌లో కుప్పకూలిన భవనం
RELATED ARTICLES