మెరుపుదాడులపై హుడా కామెంట్స్‌ను స్వాగతించిన రాహుల్
సర్జికల్ స్ట్రుక్స్‌ను మోడీ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు
న్యూఢిల్లీ: ఆర్మీ మాజీలెప్టినెంట్ జనరల్ డిఎస్ హు డా భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రుక్స్‌కు ఎక్కువ హైప్‌నివ్వడం మంచిది కాదని చేసిన వ్యాఖ్యలపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు రాహుల్ గాంధీ హుడా చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ప్రధాని మోడీపై ట్విట్టర్‌లో నిప్పులు చెరిగారు. 2016లో సైన్యం ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన మెరుపుదాడులను ప్రధాని మోడీ రాజకీయాల స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఆర్మీ సర్జికల్ స్ట్రుక్స్‌పై హుడా చేసిన వ్యాఖ్యలు స్వాగతించదగినవన్నారు. హుడా ఓ ని జమైన సైనికుడిగా స్పందించారని.. భారత్ ఆయనను చూసి గర్వపడుతుందని వ్యాఖ్యనించారు. పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ రూ.30 వేల కోట్ల రాఫెల్ డీల్‌ను చేజిక్కించుకొని ప్రయోజనం పొందిన విధంగానే… మోడీ కూడా సర్జికల్ స్ట్రుక్స్ ద్వారా స్వప్రయోజనాలను పొందాలని భావిస్తున్నా రని ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రన్‌దీప్ సర్జేవాలా కూడా హుడా చేసిన కామెంట్స్‌పై స్పందించారు. హుడా వ్యాఖ్యలతో మోడీ చిల్లర రాజకీయాలు బహిర్గతం అయ్యాయ ని తెలిపారు. ఈ విషయంలో డిఎస్ హుడాకు ధ న్యవాదాలు చెబుతున్నామన్నారు. జాతీయ భ ద్రత, వ్యూహాత్మకమైన విషయాల్లో సైనికులు ప్రదర్శించిన ధైర్య,సాహసాలను మోడీ స్వప్రయోజనాల కోసం వాడుకోవడమే కాకుండా.. ఈ ఘన కార్యం ఆయనే చేసినట్లు జబ్బలు చరుస్తున్నాడం టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 2016లో ఆర్మీ నిర్వహించిన మెరుపుదాడుకులకు నేతృత్వం వ హించిన మాజీ లెప్టినెంట్ జనరల్ డిఎస్ హుడా మాట్లాడుతూ సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రుక్స్ కు ఎక్కువ హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదని… ఆ ర్మీ జరిపిన దాడులను ఇప్పుడు రాజకీయం చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.