సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కాల్కా నుంచి సిమ్లాకు పర్వతాల మీదుగా ప్రయాణించే రైలులో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైలులోని దాదాపు 200 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. కాల్కా-సిమ్లా ప్రపంచ వారసత్వ సంపద సెక్షన్‌లోని కుమార్‌హటి నుంచి ధరమ్‌పూర్ మధ్య నడిచే హిమాలయన్ క్వీన్ రైలులో మంటలు వ్యాపించాయి. వెంటనే డ్రైవర్ మంటలను ఆర్పివేసి ఇంజన్‌ను పక్కకు తొలగించారు. అనంతరం ప్రయాణికులంతా సిమ్లాకు పయనమయ్యారు. ఏడు కోచ్‌లతో కూడిన ఈ టాయ్ ట్రెయిన్‌లో సంఘటన జరిగిన సమయంలో దాదాపు 200 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలిసింది. పర్వతాల మీదుగా నడిచే 112 ఏళ్ల క్రితం నాటి ఈ రైల్వే ట్రాకును యునెస్కో 2008లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
హిమాలయన్ క్వీన్ రైలులో మంటలు
RELATED ARTICLES