న్యూఢిల్లీ: వాహనదారులకు హెచ్చరిక.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకు ట్యాంపర్ ప్రూఫ్ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ కలిగిన నంబర్ ప్లేట్లు (హెచ్‌ఎస్‌ఆర్‌పి) ఉండాల్సిందేనని కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. ‘ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 తర్వాత అన్ని వాహనాలు హెచ్‌ఎస్‌ఆర్‌పి నంబర్ ప్లేట్లు కలిగి ఉండాలి. అవసరమైతే వాటిపై తప్పనిసరిగా అధికారిక హోలోగ్రామ్ కలిగిన స్టిక్కర్ కూడా ఉండాలి. వాహన తయారీదారులందరూ ఈ విషయాన్ని తమ డీలర్లకు తెలియజేయాలి’ అని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘హై సెక్యురిటీ రిజిస్ట్రేషన్ కలిగిన నంబర్ ప్లేట్లు భద్రతతో కూడుకున్నవే కాకుండా, నకిలీ నెంబర్లకు అడ్డుకట్ట వేయొచ్చు. అంతేకాకుండా, వీటిని తొలగించడం, పునర్వినియోగం సాధ్యపడదు’ అని గడ్కరీ వెల్లడించారు. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 చట్టంలోని, హెచ్‌ఎస్‌ఆర్‌పి ఆర్డర్స్ 2001 సవరించడం ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతులు/ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, జూన్ 5, 2018న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని గడ్కరీ చెప్పారు.
అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి
RELATED ARTICLES