సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాంగ్రాలోని లంజ్ ప్రాంతంలో గురువారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న స్కూలు బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న 35 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరంతా ధర్మశాలలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తలపెట్టిన ర్యాలీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
RELATED ARTICLES