శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వరుస ప్రయోగాలు, విజయాలతో దూసుకెళ్తుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి జిఎస్‌ఎల్‌వి ఎఫ్ 11 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జిఎస్‌ఎల్‌వి ఎఫ్ 11) ప్రయోగించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండాజిఎస్‌ఎల్‌వి వెహికల్ నింగిలోకి దూసుకెళ్లింది. 2,250 కిలోలు బరువు కలిగిన జీశాట్–7ఎ ఉపగ్రహాన్ని మోసుకుని జిఎస్‌ఎల్‌వి రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లింది. ఈ వాహక నౌక ద్వారా జీశాట్ 7ఎ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్–7ఎ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఎక్కువగా డిటిహెచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. జీశాట్–7ఎ మాత్రం అడ్వాన్స్‌డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా ఇస్రో చెబుతోంది. 2,250 కిలోలు బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో కెయు బాండ్ ట్రాన్స్‌పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్)లో రూపొందించారు.
నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్‌ఎల్‌వి ఎఫ్ 11
RELATED ARTICLES