హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నాడు తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3,529 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 32,055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,667 మంది సర్పంచి అభ్యర్థులతో పాటు వార్డుల్లో 67,316 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ఉప సర్పంచి ఎన్నికను నిర్వహిస్తారు.
పంచాయతీ పోలింగ్ తుది దశ ముగిసింది
RELATED ARTICLES