హైదరాబాద్: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల కమిషన్‌కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ‘మా పార్టీ గుర్తుగా గాజు గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు చిన్నతనం నుంచి ఈ గాజు గ్లాస్‌తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అంతేకాదు మనదేశంలో సాధారణ పౌరుడి గుర్తింపు కూడా ఇదే..’ అని పేర్కొంటూ గాజు గ్లాస్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. గాజు గ్లాస్ గుర్తుపై ఇప్పటికే జనసైనికులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో గ్లాస్ గుర్తు ఫొటో షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
జనసేనకు గాజు గ్లాస్ గుర్తు
RELATED ARTICLES