హైదరాబాద్: ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షురాలిగా సేవలందించారన్నారు. దేశం నలుమూలలా ఎవరూ వలస పోవద్దన్న ఉద్దేశంతో ఉపాధి హామీ చట్టాన్ని ఆమె తీసుకొచ్చారని చెప్పారు. ఆదివారం సోనియా జన్మదినం కావడంతో గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకులు ఆమె పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
గాంధీభవన్‌లో సోనియా జన్మదిన వేడుకలు
RELATED ARTICLES