లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగి పక్కనే నిలిపి ఉంచిన కారు, టెంట్లు కొన్నింటికి మంటలు అంటుకోవడంతో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాదంతో అక్కడి తాత్కాలిక నిర్మాణాలు కొన్ని కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో అగ్నిప్రమాదం
RELATED ARTICLES