ఈరోజుల్లో కంప్యూటర్ కి ఎంతగా అలవాటు పడిపోయామో కొత్తగా చెప్పుకోనక్కరలేదు. ఉద్యోగ, వ్యాపార రీత్యానే కాకుండా… ఇంట్లో ఆడవాళ్లకు, పిల్లలకు కూడా నేస్తం ఇదే. కంప్యూటర్ వాడేవాళ్ళు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.
ఎంత పని వత్తిడి మీదున్నా, కంప్యూర్ మీద అదే పనిగా పని చేయకండి. కంటి కండరాలు దెబ్బ తింటాయి. తలనొప్పి, దృష్టి దోషాలు చాలా వరకు వచ్చేస్తాయి. కనీసం రెండు గంటలకు ఒకసారైనా కంప్యూటర్ ని ఆపి, మీరు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోమంటే పని ఆపేసి పడుకోవాలని కాదు. కంప్యూటర్ పని ఆపి, కొంచెం సేపు వేరే పని ఏదైనా చేసుకోవచ్చు.
కనీసం 10 నిమషాలు విరామం ఇవ్వకపోతే కంటి చూపు దెబ్బ తింటుంది.కంప్యూటర్ టెక్నీషన్స్ కచ్చితంగా ఈ టెక్నిక్ వాడాలి. ఇది కేవలం కంప్యూటర్ వాడే వాళ్లకు మాత్రమె కాదు, కేబుల్ టీవీలో చానల్స్ చూస్తూ అతుక్కుపోయే వారు కూడా రెండు గంటలు కంటే ఎక్కువసేపు కంటిన్యూస్ గా చూడకూడదు.