ముగ్గురు మావోయిస్టులు హతం
రాంచీ : జార్ఖండ్‌లో ఆదివారం నాడు ఎన్‌కౌంటర్ జరిగింది. గుమ్లా ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు హతమార్చాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఘటనాస్థలి నుంచి రెండు ఏకే 47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మహవగరీ పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించామన్న పోలీసులు 17 టిఫిన్ బాంబులు, 200లకు పైగా డిటోనేటర్లను గుర్తించినట్లు తెలిపారు.