ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో బారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు పెద్ద దెబ్బతగిలింది. బీజాపూర్ జిల్లా అబూజ్‌మడ్ ప్రాంతంలోని ఇంద్రావతి నది సమీపంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌ను బీజాపూర్ ఎస్‌పి మోహిత్ గార్గ్ ధ్రువీకరించారు. ఘటనాస్థలం నుంచి 11 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భైరాంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందింది. దీంతో ఇంద్రావతి నది సమీపంలోని అబూజ్‌మడ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపి 10 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.