ఈ కాలంలో చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు అందరికి వారి వారి స్థాయిని బట్టి కావాల్సింది ఫోన్. ఇది లేకపోతే రోజు గడవదు కాదు, సెకను కూడా గడవదు అనే విధంగా తయారు అయ్యింది పరిస్థితి. ఈ రోజుల్లో ఒక మనిషిని చూడగానే వారు వాడే ఫోన్, దాని విలువను బట్టి వారి పొజీషన్ ను కాలిక్యులేట్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసే, అందరూ వారి స్థాయికి కొంత మెంచె ఫోన్ ఖరీదు చేస్తున్నారు.
ఈ ట్రెండ్ ని ఫాల్లో అవుతున్న కంపెనీలు, నిత్యం కొత్త, ఆఫర్లు, కొత్త ఫోన్స్, కొత్త కొత్త ఆప్షన్స్ కనిబెడుతూ, కష్టమర్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు అత్యంత లగ్జరీ, కాస్ట్లీ ఫోన్లను తయారుచేసే వర్చ్యూ సంస్థ తన తాజా మోడల్‌ను విడుదల చేసింది. ‘వర్చ్యూ సిగ్నేచర్ కొబ్రా’ పేరిట రూపొందిన ఈ ఫోన్ ధర అక్షరాల 2.3 కోట్ల రూపాయలు (3.60 లక్షల డాలర్లు). పేరుకు తగ్గట్టే ఈ ఫోన్ అంచుల చుట్టు ఓ పాము ప్రతిమను ముద్రించి ఉండటం ఇందులోని ప్రత్యేకత. 439 కెంపులను పొదిగి ఈ ఫీచర్ ఫోన్‌ను రూపొందించారు.
అత్యంత కాస్ట్లీ ఫోన్ రేటెంతో తెలుసా?
RELATED ARTICLES