పలన్‌పూర్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మహిళా కానిస్టేబుల్ చేసిన మోటారుసైకిల్ విన్యాసంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో ఆరుగురు పిల్లలతో కలసి ఒక మహిళా కానిస్టేబుల్ మోటారు సైకిల్ విన్యాసం చేస్తుండగా బ్యాలెన్స్ తప్పి పడిపోవడంతో వారందరూ గాయపడ్డారు. మోటారుసైకిల్ స్టంట్ చేస్తుండగా బ్యాలెన్స్ తప్పడంతో ద్విచక్రవాహనం 11 వయసు ఉన్న పిల్లల మీదకు వెళ్లిపోయిందని బనస్కాంత ఎస్‌పి ప్రదీప్ సేజుల్ తెలిపారు. మహిళా కానిస్టేబుల్ రేఖా గోహిల్‌తోపాటు ఆరుగురు పిల్లలకు స్వల్పంగా గాయాలయ్యాయని ఆయన చెప్పారు. గాయపడిన వారిని పలన్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జెఎన్ సింగ్, డిజిపి శివానంద్ ఝాలతో కలసి ఆస్పత్రిని సందర్శించారు.
గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి
RELATED ARTICLES