పార్టీ శ్రేణులకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపు
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తీవ్రమైన కష్టాలను అనుభవిస్తున్న ప్రజలకు అండగా నిలుస్తూ, సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారంనాడొక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ప్రధానాంశాలు ఇలా వున్నాయి.
“ప్రజలు అసాధారణమైన, సవాలుతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొవిడ్ 19 జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఊహించని బాధలను తీసుకువచ్చింది. ముఖ్యంగా పేదలు, అట్టడుగువర్గాలు, కార్మికవర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. భారత్‌లో 40 కోట్ల మంది కార్మికులు దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) హెచ్చరించింది. ప్రధానంగా అసంఘటిత రంగమే దెబ్బతినబోతున్నది. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మిలీనియం డవలప్మెంట్ లక్ష్యాలు, పరివేష్టిత అభివృద్ధి లక్ష్యాల్లో భారత్ ఒక భాగంగా ఉన్నప్పటికీ, తాజా ఆకలిసూచీలో మన దేశం అట్టడుగుస్థాయిలో వుండటం ఆందోళనకరం. అసలు ఆ లక్ష్యాల ప్రధాన ఉద్దేశమే పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించడం. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి బిజెపి, ఆర్ఎస్ఎస్ కూటమి స్వభావాన్ని ఏ మాత్రం మార్చలేదు. ప్రస్తుత ప్రభుత్వ నయా ఉదారవాద విధానంలో మార్పులేదు. కొవిడ్19తో ఎదురైన సంక్షుభిత పరిస్థితిని ఎదుర్కొనేందుకు సకాలంలో పార్లమెంటు లోపల గానీ, బయటగానీ, రాజకీయ పార్టీలతో తగిన సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా లేదని అర్థమైపోయింది. అయినప్పటికీ, కరోనాపై పోరుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సిపిఐ మద్దతునిస్తూనే వుంది. సిపిఐ అనేది పూర్తిగా కార్మికులు, నిరుపేదలకు చెందిన పార్టీ. ప్రస్తుతం తీవ్రంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది ఈ వర్గాలే. అందుకే వారికి సంబంధించిన సమస్యలను తక్షణమే చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది.
లాక్డౌన్ మొదలై రెండు వారాలు దాటిపోయింది. లాక్డౌన్ పొడిగింపునకే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రదేశాలు, జిల్లాలను హాట్‌స్పాట్‌గా గుర్తించి, సీల్‌వేశారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలుగా అందరిపై అసాధారణ బాధ్యతలు వున్నాయి. 95 ఏళ్ల చరిత్ర కలిగిన సిపిఐ ఎల్లప్పుడూ వినూత్న పద్ధతుల్లో తన పనితీరును మెరుగుపర్చుకుంటూ వస్తోంది. ఇదంతా పార్టీ కార్యకర్తల చిత్తశుద్ధితోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధలు అనుభవిస్తున్న ప్రజలను కలిసేందుకు, కార్యకలాపాల కోసం అందుబాటులో ఉన్న అన్ని రకాల సాంకేతిక సహాయాలను ఉపయోగించుకోవాలి. స్వతంత్రంగా, తగిన అధికారుల స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి. కరోనా వైరస్ సమస్యకు మతాన్ని ఆపాదించడానికి జరుగుతున్న కుట్రలను గ్రహించాలి. మైనారిటీ మతస్తులపై జరిగే పన్నాగాల ఫలితంగా వారిలో ప్రతీఘాత, మితవాద శక్తులు ప్రజ్వరిల్లడానికి అవకాశం వుంది. ఇది మంచి వాతావరణాన్ని విషతుల్యం చేయవచ్చు. హిందుత్వ ఫాసిస్టు శక్తులు మరింత వికారేచ్ఛతో ప్రవర్తించడానికి వారికి ఇదొక గొప్ప అవకాశం. ఈ విషయాన్ని సిపిఐ కార్యకర్తలు గ్రహించాలి.
అధిగమించలేని సంక్షోభమంటూ ఏమీ లేదు. కమ్యూనిస్టులుగా చర్చలు, సంప్రదింపులే మన ఆయుధం. మనుగడ కోసం, జీవనోపాధి కోసం పోరాడుతున్న నిరుపేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు ఆహారం, వైద్యసదుపాయం, సురక్షితమైన నివాసం, ఇతర సామాజిక భద్రత వంటి సమస్యలు పరిష్కరించడానికి క్షేత్రస్థాయి నుంచి నాయకత్వం వరకు పార్టీ సభ్యులంతా కృషి చేయాలి. పేదల పిల్లలు, విద్యార్థులు తీవ్రమైన క్షుద్భాదను ఎదుర్కొంటున్నారు. వారిలో కొద్దిమంది విద్యార్థులకే ఆన్లైన్ విద్య సదుపాయం వుంది. మిగతా వారికి అలాంటి సౌకర్యాలేమీ లేవు.
ఈ నేపథ్యంలో, ప్రజాసంఘాల నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మన పార్టీ నాయకులు చొరవచూపించి, కొవిడ్19పై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, వారి సంఘాల ప్రమేయంతో సహాయకచర్యలు చేపట్టాలి. ఈ పరిస్థితుల్లో కేరళలో సంక్షోభ పరిష్కార మార్గాలు, ఎల్డిఎఫ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రోత్సాహకరంగా వున్నాయి. అన్ని స్థాయిల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ, కేంద్ర, రాష్ర్ట నాయకత్వాలకు సమాచారాన్ని అందిస్తూ వుండాలి” అని డి.రాజా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Full Statement in English
General Secretary D. RAJA Writes to Party Cadres
Dear Comrades,
People are facing an extraordinary and challenging situation. COVID-19 has been impacting the life of the people in a big way subjecting them to unimaginable miseries. The worst-hit is the poor, downtrodden and the working people.
The International Labour Organisation (ILO) has come out with an alarming report that 40 crore workers in India are at risk of falling deeper into poverty. They are mainly from the informal sector. Eventhough India is signatory to the Millennium Development Goals and Sustainable Development Goals of the United Nations, India is at the lowest position as far as the latest Hunger Index is concerned. The main objective of MDGs and SDGs is eradication of extreme poverty and hunger among other goals.
The emerging situation in our country has not changed the character of BJP–RSS combine. It has not changed the course of neo-liberal trajectory of the present government.
Even though the Union government was not adequately prepared for the impending crisis, holding proper consultations with the political parties and Parliament on time, our Party has been cooperating with the government on measures to contain the COVID-19. Our Party, being the party of the working class and poor people, must remain active in taking up the issues concerning them in the given critical situation.
Already two weeks have passed since the lockdown. There is every possibility of lockdown getting extended and already many locations and numberof districtsare being notified as hotspots and are being sealed off.
Comrades, extraordinary situation needs extraordinary responses from us. Our Party with an outstanding history of 95 years, has always resorted to innovative methods and ways of functioning. This has to be continued with all sincerity. We must be able to make use of all available technological aids in our communications and activities in order to communicate with the suffering people and ensure that their grievances are taken up independently and also at the level of appropriate authorities.
Our Comrades should be vigilant and sensitive to the evil designs and intentions of obscurantists and communal forces on the issue of Corona virus. This may result in minority communities retreating into further ghettoization and reactionary, right wing forces among the minority communities might try to vitiate the atmosphere, giving greater opportunity for Hindutva fascist forces to become more aggressive.
Comrades, as Communists we are armed with dialectical methodology and no crisis needs to be insurmountable for us. Our cadre from top to bottom shall take up the immediate issues like food and medical care of the poor, safe shelter and all other social security to the people particularly the poor and the marginalised who are fighting for their survival and livelihood. The plight of children and students is miserable. A small section of students has the advantage of online learning while the remaining has no such access.
The class and mass organisations in which our Party Comrades are in leading positions should take all steps to involve the respective organisations in the relief work for the people while creating awareness about the pandemic COVID-19.
In the given situation, the measures taken by Kerala LDF government are quiet encouraging and showing the way the current crisis should be addressed.
Comrades, maintain constant communication with among yourselves and with comrades involved in functioning at all levels. The state and central leaderships value your feedback and information.
With revolutionary greetings
Comradely yours
S/d
D.RAJA
General Secretary
Communist Party of India
Central Office
New Delhi
Tele: 011 23235546
e-mail: cpiofindia@gmail.com