సూర్యాపేట జిల్లాలోనే 16
మొత్తం కేసుల సంఖ్య 700
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 700లకు పెరిగింది. గురువారం ఒక్క రోజే 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అయితే గురువారం నాడు ఎవరూ మృతి చెందక పోవడం శుభపరిణామం. చికిత్స పొందుతున్న 68 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 186కు చేరింది. ఈ కొత్త కేసులన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం.