బాధ్యతలు చేపట్టిన కమిషనర్
మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన కనగరాజ్
ప్రజాపక్షం/అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్(ఎస్‌ఇసి)గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి నూతన ఎస్‌ఇసిగా జస్టిస్ కనగరాజ్ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిన్న (శుక్రవారం) ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిం దే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఇసిగా ప్రభుత్వం నియమించింది. తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ మద్రాస్ హైకోర్టు జడ్జి గా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్‌గా ఆయన వ్యవహరించారు. 2006లో హైకోర్టు జడ్జిగా పద వీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. మద్యం, ధనం ప్రభావమన్నది లేకుండా నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఇటీవల అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.హైకోర్టు రిటైర్డ్ న్యా యమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఇసి)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ చేసిన సవరణల ఆర్డినెన్స్‌కు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.