HomeNewsBreaking Newsక‌రోనా మొద‌లైంది ఆమె నుంచే!

క‌రోనా మొద‌లైంది ఆమె నుంచే!

తొలి క‌రోనా బాధితురాలు గుర్తింపు
జీరోకేసుగా జుషాన్

బీజింగ్ : ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న కరోనా వైరస్ బారిన పడిన మొట్టమొదటి రోగిగా భావిస్తున్న వ్యక్తి ఆచూకీని ఎట్టకేలకు కనుగొన్నారు. ఆమె పేరు వుయ్ జుషాన్‌. ఆమె చేప‌లు, రొయ్య‌లు అమ్ముకునే చైనీస్ మ‌హిళ‌. వుహాన్ నివాసి. అమెరికాకు చెందిన ఆంగ్ల పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఈమె ఆచూకీని కనుగొంది. నెలరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. అక్క‌డి నుంచి ఒక్కొక్క‌రికీ ఈ వ్యాధి అంటుకున్న‌ది. చేప‌లు, చికెన్‌, మ‌ట‌న్ లు విక్ర‌యించే మార్కెట్ ఈ క‌రోనా వైర‌స్‌కు మూలం. అక్క‌డి నుంచి స‌ర్వ‌త్రా వ్యాపించింది.
ఏం జ‌రిగిందంటే?
వుహాన్ లోని హునన్ సముద్రజీవుల మార్కెట్లో రొయ్యలను విక్రయించే వుయ్ జూషాన్ తొలిసారి కొవిడ్ -19 లక్షణాలతో డిసెంబర్ 10వ తేదీన ఆసుపత్రికి వెళ్లారు. ఆమెకు తీవ్రమైన జలుబు చేసిందని భావించిన స్థానిక ఆసుపత్రి వైద్యులు ఒక ఇంజెక్షన్ చేసి ఇంటికి పంపించారు. కానీ, ఆమె క్రమంగా బలహీనంగా మారిపోవడంతో వుహాన్ లోని ఎలవెన్త్ హాస్పటల్ కు వెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో డిసెంబర్ 16న ఆ ప్రాంతంలోనే అతిపెద్దదైన వుహాన్ యూనియన్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు ప్రమాదకరమైన జబ్బు వచ్చిందని వారు చెప్పారు. అదే సమయంలో హునన్ మార్కెట్ నుంచి చాలా మంది అటువంటి లక్షణాలతోనే అక్కడకు వచ్చారు. దీంతో కరోనా వైరస్ సోకిందని గుర్తించిన డాక్టర్లు ఆమెను క్వారంటైన్ లో ఉంచారు. ఆ మార్కెట్ ను వెంటనే మూసివేయించారు. కొన్నాళ్లు క్వారంటైన్ లో ఉన్న తర్వాత జనవరి నెలలో జుషాన్ కోలుకొంది. ఆమె ఆ మార్కెట్లోని ఒక మరుగుదొడ్డిని వినియోగించడం వల్ల ఈ వ్యాధి వచ్చినట్లు చెబుతోంది. దీనిని మిగిలిన మాంసం విక్రేతలు కూడా వినియోగిస్తారు. వుహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ కథనం ప్రకారం కొవిడ్ -19ను తొలుత గుర్తించిన తొలి 27 మందిలో 24 మంది అదే మార్కెట్ నుంచి వచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments