HomeNewsLatest Newsఆందోళన కలిగిస్తున్న ‘సెకండరీ’

ఆందోళన కలిగిస్తున్న ‘సెకండరీ’

రాష్ట్రంలో ప్రైమరీ కరోనా కేసులు తగ్గుతున్నాయి
ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో శనివారం రెండేసి పాజిటివ్‌ కేసులు
ఆసిఫాబాద్‌, మెదక్‌లలో ఒక్కొక్కటి కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలుస్తున్న కరీంనగర్‌
నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో రెండు రోజులుగా నమోదు కాని పాజిటివ్‌ కేసులు
ట్రావెలింగ్‌ హిస్టరీ లేకున్నా పాజిటివ్‌ కేసులు నమోదు : ఐసిఎంఆర్‌
రోడ్డుపై ఉమ్మివేసినందుకు వరంగల్‌లో తొలి కేసు నమోదు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : రాష్ట్రంలో క్రమేపి ప్రైమరీ పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయి. మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారి పాజిటివ్‌ కేసులు మాత్రం తగ్గుతున్నాయి. అయితే ఇదే క్రమంలో కొత్తగా సెకండరీ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది. ఐదారు రోజుల క్రితం రాష్ట్ర పరిస్థితి పరిశీలిస్తే… ప్రతి రోజు 40 నుంచి 70 వరకు పాటిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులుగా పరిశీలిస్తే గురువారం 18. శుక్రవారం 16 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా శనివారం సాయంత్రం వరకు కొత్తగా ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మర్కజ్‌, విదేశాలకు వెళ్లివచ్చిన వారిని పూర్తిగా క్వారంటైన్‌ చేసి వారికి చికిత్సలు అందించడంతో వారిలో పాజిటివ్‌ సోకిన వారు కోలుకుని డిశ్చార్జ్‌ అవుతున్నారు. క్వారంటైన్‌ ఉన్న వారిలో గతంలో కంటే చాలా తక్కువ పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండగా ప్రస్తుతం వారి నుంచి సోకిన సెకండరీ (కాం టాక్ట్‌) కేసులు నమోదవడం మొదలయ్యాయి. గత రెండు రోజులుగా వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసుల్లో సెకండరీ కేసులే దాదాపు సగం ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాజిటివ్‌ కేసు లు ఉండడం కూడా మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇప్పటికే ఒక పాజిటివ్‌ కేసు నమోదు  కాగా శనివారం మరొకటి నమోదైంది. ఈ రెండు కూడా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తికి కాకుండా వారి కుటుంబ సభ్యలవి కావడం సెకండరీ కేసులు పెరుగుతున్నాయన్న దానికి నిదర్శనం. చిత్రమేమిటంటే మర్కజ్‌కు వెళ్లి వచ్చిన సదరు వ్యక్తికి మాత్రం కరోనా నెగెటివ్‌ వచ్చింది. మెదక్‌ జిల్లాలో మరొకరికి పాజిటివ్‌ కేసు నమోదు కాగా అతనిని గాంధీకి తరలించారు. ఖమ్మం జిల్లాలో శనివారం కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వెలుగుచూసింది. సూర్యాపేటలోనూ కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ బయటపడింది. వీటిలో సెకండరీ కేసులు ఉండడం గమనార్హం. మెదక్‌ జిల్లాలో కొత్తగా మరో పాజిటివ్‌ కేసు నమోదయింది. రెండు రోజుల క్రితం వరకు కరోనా వ్యా ప్తితో గుబులు పుట్టించిన వరంగల్‌ జిల్లా కాస్తా శాంతించింది. తాజాగా జరిపిన 170 మంది రక్తనమూనాల పరీక్షలు రాగా మొత్తం నెగేటివ్‌ వచ్చాయి. వీరి బంధువులకు కూ డా కరోనా సోకలేదు. ఇప్పటికి రాష్ట్రంలో ఎక్కువగా మేడ్చల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వరంగల్‌లో మొగిలి అనే వ్యక్తి రోడ్డుపై ఉమ్మగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాలురోజుల క్రితం వరకు కరోనా వే గంగా వ్యాప్తి చెందుతూ గుబులు పుట్టించిన నిజామాబా ద్‌ జిల్లాలో గత రెండు రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూ డా నమోదు కావడం లేదు. అలాగే కామారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లోనూ రెండు రోజులుగా ఒక్క పాజిటివ్‌ కూడా నమోదు కావడం లేదు. అయితే ఉమ్మడి కరీంగనగర్‌ జిల్లాలోని జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.
ట్రావెలింగ్‌ హిస్టరీ లేకున్నా… కరోనా పాజిటివ్‌ 
దేశంలో ఎలాంటి విదేశీ ట్రావెలింగ్‌ హిస్టరీ లేకున్నా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని ఐసిఎంఆ ర్‌ ( ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌) తాజాగా తెలిపింది. అంతే కాదు శ్వాసకోస వ్యాధులున్న వారిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని పే ర్కొంది. దేశ వ్యాప్తంగా దగ్గు, దమ్ము, ఇతర శ్వాస కోస వ్యాదులు ఉన్న 5911 మందికి కరోనా లక్షణాలు కన్పించగా వారిని క్వారంటైన్‌లో ఉంచి రక్తనమూనాలను పరీక్షించారని, వీరిలో 102 మందికి కరోనా పాజిటివ్‌ వ చ్చిందని తెలిపింది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నూ ఉందని తెలిపింది. తెలంగాణలో ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారి 104 మంది రక్తనమూనాల ను పరీక్షించగా  29 మందికి పాజిటివ్‌ వచ్చిందని పే ర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 102 మంది రక్తనమూనాలు ప రీక్షించగా పది మందికి పాజిటివ్‌ తేలిందని చెప్పింది.  ఎ లాంటి ట్రావెలింగ్‌ హిస్టరీ లేకున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇ ప్పటి వరకు 104 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు న మోదయ్యాయని ఐసిఎంఆర్‌ స్పష్టం చేసింది.
కట్టడిలో ఆదర్శంగా నిలుస్తున్న కరీంగనర్‌ ః కరోనా కట్టడిలో కరీంనగర్‌ జిల్లా మిగతా జిల్లాలతో పో లిస్తే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో మొట్టమొదటి సా రిగా ఇండోనేషియా నుంచి వచ్చిన వారు, మర్కజ్‌ వెళ్లి వ చ్చిన వారి నుంచి కరోనా సోకిందని గుర్తించింది ఇక్కడే. వెంటనే అప్రమత్తమై ఇండోనేషియా, మర్కజ్‌, ఇతర విదేశాల నుంచి వచ్చిన వారిని వేగంగా గుర్తించి వారిని మొ దటగా క్వారంటైన్‌కు, పాజిటివ్‌ ఉన్న వారిని ఐసోలేషన్‌కు తరలించారు. పాజిటివ్‌ కేసులు వెలుగుచూసిన ప్రా ంతాలను పూర్తిగా దిగ్భందనం చేసి కట్టుదిట్టం చేశారు. వెంటనే వారు కలిసిన వారు, సన్నిహితులు ఇతరత్ర వారిని పూర్తిగా గుర్తించి వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. క్వారంటైన్‌లో 14 రోజులు ఉండి నెగేటివ్‌ తేలినప్పటికి మరో 14 రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉంచి రెండో సారి నెగేటివ్‌ వచ్చిన తర్వాతే వారిని వదిలిపెట్టా రు. ఇండోనేషియా, మర్కజ్‌ నుంచి వచ్చిన వారు, వారు కలిసిన వారిని ఆధునిక టెక్నాలజీ సహాయంతో త్వరగా కనిపెట్టారు. దిగ్భందనం చేసిన ప్రాంతాలతో పాటు, ఇం డోనేషియా, మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారు తిరిగిన ప్రాంతాలతో డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టారు. పాజిటివ్‌ సోకిన వారిని జియో ట్యాగింగ్‌ చేశారు. కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులను కూడా జియో ట్యాగింగ్‌ చేసి వారి కదలికలను కనిపెడుతూ ఎటూ వెల్లకుండా, వారి నుంచి మరెవరికి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంపి, ఎంఎల్‌ఎలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా ప్రాంతాలు, వీధుల్లో ఉండే పెద్ద మనుషుల సహకారాన్ని తీసుకుని కరోనా లక్షణాలు ఉన్న వారిని, ఇండోనేషియా వా రితో, మర్కజ్‌ వెలి వచ్చిన వారితో సన్నిహితంగా మెదిలిన వారిని గుర్తించి, వారిని ఒప్పించి క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలించారు. లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. మొత్తం 5600 వాహనాలను సీజ్‌ చేశారు. కొందరిని పోలీసులు తమదైన శైలిలో శిక్షలు వేశారు. ఫలితంగా ఉల్లంఘనలు తగ్గాయి.  దీంతో కరీంనగర్‌లో వ్యాప్తి తగ్గింది. ప్రస్తుతం రెండు రోజులుగా ఇక్కడ ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కావడం లేదు.
కర్నూల్‌లో అత్యధిక రెడ్‌ జోన్లు ః ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కుదుటపడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికి ఆందోళనకర పరిస్థితులు మాత్రం తగ్గలేదు. క ర్నూల్‌ జిల్లాలో  రాష్ట్రంలోనే అత్యధికంగా 32 రెడ్‌ జోన్లు ఏర్పాటు చేశారు.  కర్నూల్‌లో ఒకే సారి అత్యధిక కేసులు నమోదై కొన్ని రోజుల పాటు రాష్ట్రంలోనే అధిక కేసులు నమోదవుతున్న జిల్లాగా నిలిచింది. గురువారం ఈ జిల్లాల్లో 74కేసులు పాజిటివ్‌ కేసులు ఉండగా శుక్రవా రం ఒక్కటే పెరిగి 75కు చేరి రాష్ట్రంలోనే మొదటి స్థా నంలో ఉంది. తాజాగా శనివారం  సాయంత్రం వరకు మ రో 5 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో  ఈజిల్లాలో 32 రెడ్‌ జోన్లు ఏర్పాటుచేశారు. కర్నూల్‌ త ర్వాత నెల్లూరులో కరోనా వేగంగా వ్యాప్తి చెందడం మొదలయింది. దీంతో ఈ జిల్లాలో 22 రెడ్‌ జోన్లు ఏర్పాటుచేశారు. ఇక ఎక్కువ కేసులు నమోదవుతున్న బెజవాడ నగరాన్ని దాదాపు పూర్తిగా రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే తమిళనాడులో కంటాక్ట్‌ కేసుల నమోదు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన అయిదుగురి నుంచే కరోనా వ్యా ప్తి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది.
శుక్రవారం ఒక్క రో జే ఈ రాష్ట్రంలో 70 కాంటాక్ట్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో చెన్నైలోనే ఎక్కువగా ఉన్నాయి. దేశంలోనే ఎక్కువ కేసులతో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రంలో ముంబై నగరం హడలెత్తిస్తోంది.
ఈ నగరంలో శుక్రవారం ఒక్క రోజే 900 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 40 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 239కి చేరింది. ఒక్క రోజులోనే 1035 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 7447 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 643 మంది కోలుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments