వాషింగ్టన్ : కరోనా పరిస్థితి చాలా దారుణంగా వుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగా ఒక వ్యాధి అమెరికాను భయపెడుతుందని ఊహించలేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన అంచనా ప్రకారం కచ్చితంగా లక్ష మరణాలు దాటవచ్చని అన్నారు. మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ముందస్తు చర్యగా లాక్‌డౌన్ ఆంక్షలను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పటి వరకు సామాజిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.మరికొన్ని వారాల్లో దేశంలో పరిస్థితులు యథాతథ స్థితికి చేరుకుంటాయని ఇటీవల ఓ సందర్భంలో అభిప్రాయపడ్డ ట్రంప్ ఇప్పుడు ఆ మాటల నుంచి వెనక్కితగ్గడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఈస్టర్ పర్వదినం నాటికి అంతా సర్దుకోవాలని తాను ఆశించానన్నారు. కానీ, పరిస్థితులు ఆ దిశగా సాగడం లేదని నిరాశ వ్యక్తం చేశారు. అమెరికాలో ఇప్పటి వరకు 1,42,226 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 2,493 మంది మరణించారు. మరో 4,443 మంది కోలుకున్నారు.
లక్ష మరణాలు ఖాయం : ట్రంప్
RELATED ARTICLES