487కి పెరిగిన మొత్తం కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 487కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 మంది మృతిచెందగా.. 45మంది కోలుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 430 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మమేరకు వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా వైరస్ కేసు నమోదయింది. సిరిసిల్లలో ఇదే తొలి కేసు. ఇప్పటివరకు అత్యధికంగా హైదరాబాద్‌లో 179 కేసులు నమోదు కాగా, నిజామాబాద్‌లో 49 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 27, వరంగల్ అర్బన్‌లో 23, మేడ్చల్‌లో 21, జోగులాంబ గద్వాల జిల్లాలో 19, నిర్మల్‌లో 15 కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 10, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో రెండేసి కేసులు, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పదేసి కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లో ఏడు, మహబూబాబాద్‌లో ఒకటి, మెదక్‌లో ఐదు, నల్గొండలో 12, సంగారెడ్డిలో ఏడు, సిద్ధిపేటలో ఒకటి, సూర్యాపేటలో 9, వికారాబాద్‌లో 8 కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ద్వారా సోకినట్లు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అ లాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 101 హాట్‌స్పాట్లు గు ర్తించారు. ఆ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించా రు.
ప్రస్తుతం డయాగ్నొస్టిక్ అవసరాల కోసం ఆరు డయాగ్నొస్టిక్ ల్యాబులు పనిచేస్తున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.