న్యూఢిల్లీ: హస్తినలో పలువురితో భేటీలో బిజీబిజీగా గడుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో భేటీ అయ్యారు. తెలంగాణలో బిసి జనాభా గణన, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను త్వరలో ప్రారంభించబోతున్నందున వాటిపైనా కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో సుమారు 22లక్షలకు పైగా ఓట్లు గల్లంతైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ వెల్లడిస్తూ అందుకు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో తొలగించిన ఓట్ల అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చనిపోయిన వారి పేర్లు, రెండు, మూడు సార్లు జాబితాలో వచ్చిన పేర్ల తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిప్యాట్‌లలో తలెత్తిన ఇబ్బందులపైనా వీరి భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే, తెలంగాణలో ఎన్నికలను సజావుగా నిర్వహించడంతో మర్యాద పూర్వకంగానే ఆయనను సీఎం కలుస్తున్నారని టిఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
సిఇసి సునీల్ అరోరాతో సిఎం కెసిఆర్ భేటీ
RELATED ARTICLES