29 వరకు ఎన్‌ఐఎ కస్టడీకి అప్పగించిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది సజ్జన్‌ఖాన్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని లజ్‌పత్ రాయ్ మార్కెట్ ప్రాంతంలో సజ్జన్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ సెల్ డిసిపి ప్రమోద్‌సింగ్ కుష్వాహా తెలిపారు. పుల్వామా దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్న ముదసిర్ అహ్మద్‌ఖాన్‌కు సజ్జన్‌ఖాన్ సన్నిహితుడని పోలీసులు వెల్లడించారు. దక్షిణ కశ్మీర్‌లోని ట్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ సమయంలో ముదసిర్ అహ్మద్‌ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) మోస్ట్ వాంటెడ్‌లిస్ట్‌లో ఉన్న ముదసిర్‌ఖాన్‌ను ఢిల్లీలో శాలువాలు విక్రయిస్తుండగా గుర్తించి అరెస్టు చేశారు. అతడిని ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 29 వరకు ఎన్‌ఐఎ కస్టడీకి అప్పగిస్తూ అడిషనల్ సెషన్ జడ్జి రాకేశ్ సయాల్ తీర్పునిచ్చారు.