HomeNewsLatest Newsఆటో డ్రైవర్ల ఆర్తనాదాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలె : చాడ

ఆటో డ్రైవర్ల ఆర్తనాదాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలె : చాడ

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి   చాడ వెంకట్‌ రెడ్డి

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌ నగరంలో  వేలాది మంది ఆటోడ్రైవర్ల బ్రతుకులు అర్తనాదాలతో రోడ్డున పడ్డాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయం సత్యనారయణ రెడ్డి భవన్‌ వద్ద ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, హైదరాబాద్‌ నగర సమితి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లకు, వారి కుటుంబాలకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను చాడ వెంకట్‌ రెడ్డి పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి లేక స్వశక్తితో ఆటోలు నడుపుకుంటూ బతుకుతున్న ఆటో డ్రైవర్లకు ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు.  ఆటోరంగాన్ని పరిశ్రమగా గుర్తించి ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ప్రత్యేక నిధిని ఏర్పాటు  చేసిఉంటే  లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు ఈ పరిస్థితి రాకపోయేదని తెలిపారు. లాక్‌డౌన్‌ తో పనులు లేక ఇబ్బందులు పడుతున్న అసంఘటిత రంగ ఆటో కార్మికులకు ఆరు నెలల వరకు నెలకు రూ.5 వేలు ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని 40 కోట్ల మందిని కరోనా వైరస్‌ పేదరికంలోకి నెట్టేయగలదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసిందని గుర్తు చేశారు. దేశంలోని కార్మికుల్లో దాదాపు 90 శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారని, వారి మీద తీవ్రంగా ప్రభావం చూపుతోందన్నారు. కరోనా వైరస్‌ను అరికట్టడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మళ్ళీ పొడిగించిందని, ఈ నెపథ్యంలో ఉపాధి లేక అవస్థలు పడే పేద కార్మికులను, ప్రజలను గుర్తించి ఆహార  భద్రత కల్పించాలని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చాడ వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఈటి నరసింహా మాట్లాడుతూ కరోనా ప్రమాద ఘంటికలు వినిపించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొనడం వల్లే జరిగిన నష్టం జరిగిందని, లాక్‌డౌన్‌ పేరుతో కుప్పకూలుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ వల్ల సామాన్యుల జీవితాలు చెల్లా చెదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు లాక్‌డౌన్‌ వల్ల కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల మీద కోలుకోలేని దేబ్బ పడిందన్నారు.  ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, ఏ పని, ఏ ఆదాయం లేకుండా ఉంటున్న ప్రజల పరిస్థితి అల్లకల్లోలం కాకముందే వారికి ఆర్థిక సహాయం ఆహారం, కనీస సౌకర్యాలు సత్వరమే కల్పించాలన్నారు. ఎఐటియుసి హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎం.నర్సింహా మాట్లాడుతూ ఉన్నత వర్గాలు, కార్పోరేట్‌ సంస్థలు, పెట్టుబడి దారులు, వ్యాపార సంస్థలపై పన్నులు పెంచి లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు,అసంఘటిత రంగ కార్మికులకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ హైదరాబాద్‌ నగర సమితి ప్రధాన కార్యదర్శి ఆర్‌. మల్లేష్‌ కురుమ, నాయకులు ఎస్‌కె లతీఫ్‌, ఎండి ఫరూక్‌, కె.శంకర్‌, సాయిబాబా, ఎం. శివ తదితరులు పాల్గొన్నారు.

వలస కూలీలను, పేదలను ప్రభుత్వం ఆదుకోండి

ప్రజాపక్షం / హైదరాబాద్‌/బోడుప్పల్‌ :కరోనా విపత్తుతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో వలస కూలీలు, పేదలు  నిత్యావసర వస్తువులు, డబ్బులు లే క అనేక అవస్థలు పడుతున్నారని వారిని ప్ర భుత్వం అనిన విధాల ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌. బాలమల్లేష్‌తో కలిసి చాడ వెంకట్‌ రెడ్డి  ఆదివారం మేడిపల్లిలోని భగత్‌సింగ్‌నగర్‌లో సి పిఐ ఆధ్వర్యంలో పేదలు, కూలీలకు బి య్యం, కూరగాయలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ంలో కరోనా కరాళ నృత్యం చేస్తోందని అ న్నారు. కరోనా వల్ల భారత దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు బియ్యం పంపిణీ ప్రతి కుటుంబానికి రూ.1500లు ఇస్తామని ప్రకటించినప్పటికి అవి సక్రమంగా ప్రజలకు అందడం లేదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న 15 వందల రూపాయల సహాయాన్ని రూ.5 వేలకు పెం చాలని డిమాండ్‌ చేశారు. రేషన్‌ కార్డులు లేని వారికి కూడా బియ్యం, డబ్బులు ప్ర భుత్వం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన పథకం డబ్బులు ప్రజలకు అందడం లేదని ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ప్రజలకు అందేలా ప్రధాని దృష్టికి తేవాలన్నారు.  ఎన్‌. బాలమల్లేష్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, కూలీలు, మున్సిపల్‌ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కో రారు. సర్వేనంబర్‌ 48లోని పేదల గెడిసెలు రెగ్యులరైజ్‌ చేసి వారిని ఆదుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డిజి సాయిలు గౌడ్‌, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు సిహెచ్‌ దశరథ్‌, జె.లక్ష్మీయాదవ్‌, ఆర్‌. కృష్ణమూర్తి, కాప్రా మండల సిపిఐ కార్యదర్శి ఎన్‌.నర్సింహా, మేడిపల్లి మండల సిపిఐ నాయకులు బాల్‌రాజ్‌, మార్టిన్‌, రచ్చ కిషన్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి.లక్ష్మణ్‌, సహాయ కార్యదర్శి కె.జ్యోతి, మహిళా సమాఖ్య నాయకులు ప్రమీల, జె.మల్లమ్మ, యాదమ్మ, మాధవి, మహాలక్ష్మి, మహేశ్వరి, సిపిఐ నాయకులు నరేందర్‌ ప్రసాద్‌, జంగయ్య, వెంకటా చారి, శ్రీనువాస్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

గెస్ట్‌ లెక్చరర్ల పెండింగ్‌ వేతనాలేవీ?
మంత్రి సబితకు  చాడ  వినతి

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పది జిల్లాల్లో ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థల్లో (డిఐఇటి) పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్ల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెం కట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మే రకు ఆయన విద్యాశాఖ మంత్రి స బితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు. దా దాపు 60 మంది గెస్ట్‌ లెక్చరర్లు గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నారని గత పది నెలల నుండి వారికి జీతాలు చెల్లించడం లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. జీతాలు లేక వారి కుటుంబ స భ్యుల కనీస అవసరాలు కూడా తీ ర్చలేక ఇబ్బంది పడుతున్నారన్నా రు. ఇంటి అద్దె కట్టలేక, చేసిన అ ప్పులు తీర్చలేక, పిల్లల పీజులకు, వైద్యానికి డబ్బులు లేక మానిసిక, సాంఘీక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. వీటిని పలు పర్యాయాలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నా ప్రయోజనం లేకుండా పో యి ందన్నారు.  విద్యార్థులకు ఉత్తమ శిక్షణనిచ్చే వీరి సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకొని పెం డింగ్‌ వేతనాలు ఇప్పించాలని ఆ యన మంత్రికి విజ్ఞప్తి చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments