HomeNewsLatest Newsధాన్యం, పండ్ల కొనుగోళ్లపై దృష్టి సారించండి

ధాన్యం, పండ్ల కొనుగోళ్లపై దృష్టి సారించండి

రేషన్‌ కార్డులు లేని పేదలకు బియ్యం, నగదు పంపిణీ చేయాలి
సిఎంకు చాడ వెంకటరెడ్డి లేఖ

ప్రజాపక్షం/హైదరాబాద్‌: రైతులు పండించిన ఉత్పత్తులు ప్రధానంగా పండ్లు, ధాన్యం, మిర్చి, పసుపు  కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెల్ల రేషన్‌ కార్డులు లేని అర్హులైన పేదలందరికీ బియ్యం, నగదు పంపిణీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. ‘వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉండి రైతు సమస్యల పరిష్కారానికి నిరంతరం ఆలోచించే  మీరు రైతు ఉత్పత్తుల కొనుగోలు విషయాల గురించి ప్రత్యేక చర్యలు చేపట్టడం మంచి పరిణామమని, మీ నిర్ణయాలు కొంత ఉపశమనం కల్గిస్తున్నా వడగండ్ల వాన, గాలి దుమారం వల్ల పరిస్థితి గందరగోళంగా మారిందని’ ఆయన తన లేఖలో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ధాన్యం కొనుగోళ్లు అన్ని గ్రామాల్లో ప్రారంభమైందని, అయితే కొంతమంది రైస్‌ మిల్లర్లు తమకు హమాలీలు లేరనే సాకుతో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉండడం చేత వర్షాలు పడితే తడిచి ముద్దయ్యే ప్రమాదం ఉందని, దీనిపై జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మిర్చి, పసుపు, మొక్కజొన్న ఉత్సత్తులు చేతికొచ్చే ఈ తరుణంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి కొనుగోలు చేయాలన్నారు. బత్తాయి, మామిడి, జామ లాంటి పండ్లు ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల పాడయ్యే ప్రమాదం ఉందని వెంటనే వీటిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా కోహెడ వద్ద అన్ని రకాల సదుపాయాలతో పండ్ల మార్కెట్‌ను ఏర్పా టుచేసి అక్కడ కొనుగోలు చేస్తున్నట్లు  తెలిపారని, అయితే నల్లగొండ జిల్లాలోనూ అత్యధికంగా పండించే బత్తాయి కొనుగోలుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది నిరుపేదలకు తెల్ల రేషన్‌ కార్డులు లేవని వారికి కార్డులతో నిమిత్తం లేకుండా బియ్యం, నిత్యావసర వస్తువులు, రూ.1500 నగదు  అందజేయాలని కోరారు. వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక ప్యాకేజి కింద ప్రతి కుటుంబానికి రూ.5వేలు నగదు, నిత్యావసర వస్తువులు అందజేయాలన్నారు. రాష్ట్ర జనాభా 3 కోట్లకు పైగా ఉంటే  ప్రభుత్వానికి ఉన్నా అన్ని వనరులపై ఎంత కృషిచేసినా కొన్ని వేల మందికి మాత్రమే కరోనా టెస్టులు చేయగలిగారని, 99 శాతం ప్రజలకు టెస్టులు చేయాల్సి ఉందన్నారు. అనారోగ్యంతో ఉన్న వారికి, అనుమానితులకు టెస్టులు చేయాలన్నా లక్షల మందికి టెస్టులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ను తెప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయని, దీని ద్వారా 5 నిముషాల్లో పరీక్ష ఫలితం వస్తుందని చెబుతున్నారని, ఇలాంటివి మన రాష్ట్రానికి కూడా అవసరమని చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వాటిని అందుబాటులోకి తేవాలని, ప్రైవేటు ఆసుపత్రులను ఈ పరీక్షలు చేయడానికి రాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. మన రాష్ట్రం కూడా నేరుగా దక్షిణ కొరియా నుంచి రాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ను ప్రత్యేక విమానం ద్వారా తెప్పించుకోవాలని సూచిం చారు. అప్పటివరకు ఎపి ప్రభుత్వం నుంచి 10 వేల కిట్స్‌ తెప్పించాల్సిన అవసరముందన్నారు. ధాన్యం, పండ్లు లాంటి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు మార్గదర్శకాలు ఇచ్చినా అమలు కావడం లేదని వీటిపై ప్రత్యేక నిఘా పెట్టి కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించేందుకు దృష్టిసారించాలని చాడ వెంకటరెడ్డి సిఎం కెసిఆర్‌ను కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments