న్యూఢిల్లీ : తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్పిఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనా వైరస్ ప్రబలిన కారణంగా 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో 2021 జనగణన (సెన్సస్) తొలి దశ ప్రక్రియను వాయిదా వస్తున్నామని, దాంతో పాటు ఎన్పిఆర్ను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.