ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లోనిలో బిజెవైఎం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడిని ముగ్గురు దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. భగత్‌సింగ్ ఖారీ (30) చిరోరి పట్టణంలో పశువుల యాజమానుల నుంచి పాలు సేకరిస్తున్న ఈ ఘటన జరిగినట్లు సీనియర్ ఎస్‌పి ఉపేంద్ర అగర్వాల్ తెలిపారు. ఖారీ తన ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉండగా ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి కాల్చి చంపినట్లు తెలిపారు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని చెప్పారు. ఖారీ శరీరంలోకి 9 బుల్లెట్లు దూసుకుపోయినట్లు వెల్లడించారు. మృతుడి తండ్రి ఓంకార్ ఖారీ సిబిఐ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా మూడేళ్ల క్రితం పదవీ విరమణ చేశాడని, వీరికి శత్రువులు లేరని ఆయన పేర్కొన్నారు. నిందుతులను పట్టుకునేందుకు మూడు బృందాలు నియమించామని తెలిపారు. ఖారీ హత్యకు నిరసనగా చిరోరి పట్టణంలో వ్యాపారులు తమ షాపులను స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు.