హైదరాబాద్ : అమెరికాలో ఎంఎస్ చేస్తున్న పూస సాయికృష్ణ అనే విద్యార్థిపై కొందరు దుండగులు కాల్పులు జరిపి, తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సాయికృష్ణ తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా వాసి. ఆయన అమెరికాలోనే చదువుకుంటూ ఉద్యోగం చేశారు. మిచిగాన్‌లో ఆయన రెస్టారెంట్ నుంచి పార్సిల్ తీసుకొని బయటకు వస్తుండగా, కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి, ఆయన వద్ద ఉన్న కారు, డబ్బు, గుర్తింపుకార్డులు, ఇతర సామాగ్రిని దోచుకొని వెళ్లిపోయారు. కుడిచేతికి బుల్లెట్ గాయమైంది. సాయికృష్ణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన అమెరికాలోని లోరెంచ్‌టెక్ సౌత్‌ఫీల్డ్ యూనివర్శిటీలో ఎంఎస్ చేస్తున్నారు. అతను మహబూబాబాద్ జిల్లాకు చెందిన పూస ఎల్లయ్య, శైలజల కుమారుడు.
మహబూబాబాద్ వాసిపై అమెరికాలో కాల్పులు
RELATED ARTICLES