హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్ కొండ మండలాన్ని కొత్తగా ఏర్పాటు కానున్న నారాయణపేట జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ పలు గ్రామాల ప్రజలు ధమాయిపల్లి వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ధర్నాను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా, ఆగ్రహించిన గ్రామస్తులు ఎదురుదాడికి దిగారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన వివాదంలో సి.ఐ. పాండురంగారెడ్డి పై రాళ్లతో దాడి చేయడంతో సి.ఐ. తలకు గాయాలయ్యాయి. జిల్లా ఎస్‌పి రెమా రాజేశ్వరి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి శాంతించింది.
https://youtu.be/ibPoWZMYcMI