ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో ఆశక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2014 ఎన్నికలలో జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి, బీజేపీ కి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఎన్నికల వాగ్ధానంలో ప్రత్యేక హోదా ముఖ్యమైన అజండాగా ప్రచారం చేసారు. ప్రత్యేక హోదా రావాలంటే, కేంద్ర పార్టీ సపోర్ట్ ఉన్న టీడీపీ కి ఓటు వెయ్యాలని పవన్ ప్రచారం ప్రజలలో ఆశ కలిగించి, ఆ ఆశ టీడీపీ ని గెలిపించేలా చేసింది. కాని పరిస్థితి తారుమారయ్యింది. ప్రత్యేకహోదా తెచ్చే పరిస్థితి టీడీపీ కి గాని, ఇచ్చే ఉద్దేశం బీజేపీ కి గాని లేదని తేలింది.
ఈసారి వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ తన పార్టీ తో తానే రంగంలోకి దిగుతున్నాడు. దీనితో బీజేపి కొత్త ప్లాన్ వేయడం మొదలు పెట్టింది. బిజెపి ఏపీలో ఎదిగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అన్ని రాష్ట్రాలలో పాతుకుపోయెందుకు గాను, ఆ ఆ రాష్ట్రాలలో సినిమా తారలపై కన్ను వేసింది బిజెపి. ఇందులో భాగంగా ఏపీ బిజెపి నేతలు అల్లు అర్జున్ మద్దతును కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఓ బిజెపి నేత… అల్లు అర్జున్‌కు సొంతగా ఇమేజ్ ఉందని, ఆయనను తాము సంప్రదించామని, ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఇప్పుడు రావడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది.
ఒకవేల ఈ వార్త నిజమైతే మెగా ఫ్యామిలిలో పెద్ద చిచ్చే మొదలవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే… పవన్, అల్లు అర్జున్ ఫాన్స్ మద్య గొడవలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అలాంటిది ఇప్పిడు అల్లు అర్జున్, పవన్ కు వ్యతిరేకంగా బీజేపీ తరపున ప్రచారంలోకి దిగితే మెగా ఫ్యామిలిలో మోడీ పెట్టిన చిచ్చుకు మెగా ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి…