అనుష్క పెళ్లి పై ఇప్పటి ఎన్నో రూమర్లు వచ్చాయి. 2005 లో విడుదల అయిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అనుష్క. దాదాపు పది సంవత్సరాలు పాటు తెలుగు తెరపై వెలుగుతున్న అనుష్క వయసు 36 సంవత్సరాలు.అరుంధతి సినిమాని నుంచి అనుష్క కెరియర్ లో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోతుంది.
అనుష్కకు జేజమ్మ తరవాత బాహుబలి లో దేవసేన పాత్రకు అంతటి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం అనుష్క భాగమతి అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా పూర్తి అయిన తరవాత పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అనుష్క ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటుందని పుకార్లు వినిపించగా, కాదు తల్లితండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు.తాజాగా అనుష్క పెళ్లి పై వచ్చిన వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని నాగార్జునతో అనుష్కకు మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యకు, అఖిల్ కు అనుష్కా యోగా కూడా నేర్పించింది.
నాగార్జున తో ఆమెకు ఉన్న రిలేషనే ఆమె పెళ్ళికి ఆటంకం అవుతుందని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున సన్నిహితుడైన ఒక వ్యాపారవేత్త అనుష్కను పెళ్లి చేసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి గురించి బాగా తెలిసిన నాగార్జునే ఈ పెళ్లి సెట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.ఏదేమైనా గతంలో లానే అనుష్క పెళ్లి పై ఇలాంటి రూమర్లు వస్తూ ఉన్నాయి గాని, అసలు విషయం అనుష్కా చెప్పే వరకు మనం ఏదీ నమ్మకూడదు.