యాంకర్ గా బుల్లితెరపై సత్తా చాటిన అనసూయకు సినిమా చాన్సేస్ రావడం, అందులో తను సక్సెస్ అవ్వడానికి గట్టి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అనసూయకు మంచి ఫ్యాన్ ఫాల్లోయింగ్ ఉంది. అయినా కూడా సినిమాలలో తను సక్సెస్ సాధించడానికి కొంచెం కష్టపడుతుందనే చెప్పాలి.
ఇదిలా ఉంటె ఇప్పుడు అనసూయపై సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వార్తలపై ఆమె సీరియస్ అయ్యింది. కొద్ది రోజులుగా అనసూయ లావు తగ్గేందుకు సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు తన వరకు రావడంతో అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి న్యూస్ క్రియేట్ చేస్తున్నవారిపై సీరియస్ అయ్యింది. తాను షార్ట్ కట్స్ నమ్మనని.. ఎలాంటి సర్జరీ చేయించుకోవటం లేదని తెలిపింది. నా నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకుండానే ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చెయ్యడంపై ఆగ్రహం చూపింది.