HomeNewsఅమెరికన్లు మన భారతదేశంలో కనుగొన్న మొట్టమొదటి హిల్ స్టేషన్ ఏమిటో తెలుసా?

అమెరికన్లు మన భారతదేశంలో కనుగొన్న మొట్టమొదటి హిల్ స్టేషన్ ఏమిటో తెలుసా?

పూర్వం ప్రాచీన గిరిజన తెగ కు చెందిన ఈ ప్రదేశం అమెరికన్ల వల్ల బయటి ప్రపంచానికి తెలిసింది. తమిళనాడు రాష్ట్రంలోని పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు కలిసే చోట, కేరళ సరిహద్దుకు సమీపంలో ఈ ప్రదేశం ఉంది. రెండువేల మీటర్ల ఎత్తుకు పైగా ఉన్న అందమైన పళని కొండల్లో ‘కోడై’ దాగున్నది. ఇంతకీ ఆ ప్రదేశం ఏమిటని అనుకుంటున్నారా?

ఆ ప్రదేశం పేరు ‘కొడైకెనాల్’. అప్పట్లో దక్షిణ తమిళనాడు ప్రాంతంలో అమెరికన్లు, వారి ధార్మిక కేంద్రాలైన చర్చీలు, మిషనరీ లను నడిపేవారు. కానీ వారు అక్కడి వేడికి తట్టుకోలేక జబ్బులపాలై అనేక  కష్టాలు  పడేవారు. దాంతో వారు మదురై సమీపంలో చల్లని ప్రదేశం కొరకై అన్వేషించగా… ఫలితంగా క్రీ.శ. 1845 వ సంవత్సరంలో ‘కొడైకెనాల్’ ఏర్పాటైంది.

దిండిగల్ జిల్లా కు చెందిన ఈ హిల్ స్టేషన్ మదురై కు 120 కి.మీ. దూరంలో, పళని కి 65 కి. మీ. దూరంలో, దిండిగల్ కు 96 కి.మి. దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ఉండే దట్టమైన అడవులు, ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, సరస్సులు, వ్యూ పాయింట్ లు, రాతి ప్రదేశాలు, పూల గార్డెన్ లు, పార్కులు, జలపాతాలు తప్పక సందర్శించాలి. కొడైకెనాల్ హనీమూన్ జంటలకి ప్రసిద్ధి చెందినది. కొత్తగా పెళ్ళైన జంటలు ఇక్కడకు టూరిస్ట్ లుగా వచ్చి ఎంజాయ్ చేస్తారు.దాదాపు ఇది తమిళనాడు నడిబొడ్డున ఉందనే చెప్పాలి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments