హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనకు పెద్ద బాధ్యతను అప్పగించారన్నారు. 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు గతంలో మంత్రి పదవి ఇస్తానని నమ్మకద్రోహాం చేశారని తెలిపారు. కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వడంతో పాటు పెద్ద బాధ్యతను అప్పగించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా గ్రామాలు ఇంకా అధ్వానంగా ఉన్నాయని, సిఎం కెసిఆర్ తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టంతో గ్రామాల రూపురేఖలు మారతాయని దయాకర్రావు చెప్పారు.
మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్రావు బాధ్యతల స్వీకరణ
RELATED ARTICLES