తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
19న ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో…
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో అదే రోజు ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. కేబినెట్ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. శుక్రవారం నాడు రాజ్‌భవన్‌కు వెళ్లిన కెసిఆర్.. గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. గవర్నర్‌తో సిఎం భేటీ అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కేబినెట్ విస్తరణపై ప్రకటన వెలువడింది. మంత్రివర్గ విస్తరణపై సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకోవడంతో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మాత్రమే కేబినెట్‌లో ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో 16 మందికి అవకాశముంది. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 16 మందినీ తీసుకోకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేబినెట్‌లో చోటు దక్కించునే విషయంలో కొందరు నేతల పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి లేదా జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, కొప్పుల ఈశ్వర్, పద్మాదేవేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కేటీఆర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.