చెన్నై : స్విస్ ప్రముఖ అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్లబ్ బాసెల్ హోల్డింగ్ ఎజితో చెన్నై సిటి ఫుట్‌బాల్ క్లబ్ (సిసిఎఫ్సి) ఒప్పందం కుదుర్చుకుంది. ఎఫ్‌సీ బాసెల్ హోల్డింగ్ క్లబ్లో ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు మహ్మద్ సలాహ్, గ్జెర్డాన్ షాఖ్రి, ఇవాన్ రాక్టిక్లు ఉన్నారు. ఇక స్వదేశంలో తిరుగులేని ఫుట్‌బాల్ క్లబ్‌గా దూసుకుపోతున్న సిసిఎఫ్సికి ఇదొక సువర్ణ అవకాశం. చైన్నై ఫుట్‌బాల్ క్లబ్‌లోని 26 శాతం వాటాను ఎఫ్‌సి బాసెల్ కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందంతో యువ ఆటగాళ్లకు మరింత మెరుగైన శిక్షణ అందజేయడమే తమ లక్ష్యమని చెన్నైక్లబ్ తెలిపింది. తమిళనాడులో అత్యుత్తమ రెసిడెన్షియల్ యూత్ అకాడమీని ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు.
అంతర్జాతీయ ఎఫ్సితో చెన్నై ఫుట్‌బాల్ క్లబ్ ఒప్పందం
RELATED ARTICLES