వరుసగా రెండోసారి టైటిల్ కైవసం, ఫైనల్లో ఓడిన సౌరాష్ట్ర, రంజీ ట్రోఫీ
నాగ్‌పూర్: డిఫెండింగ్ చాంపియన్ విదర్భ వరుసగా రెండోసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుం ది. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్లో 78 పరుగులతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 2018 సీజన్ టైటిల్ సొంతం చేసుకుంది. 206 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్రను విదర్భ స్పిన్నర్ ఆదిత్య సర్వతె (6/59) అద్భుతమైన బౌలింగ్‌తో అడ్డుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నూ ఆదిత్య 5 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో (11 వికెట్లతో) పా టు బ్యాటింగ్‌లోనూ కీలకమైన (49 పరుగులు) చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన ఆదిత్య సత్వరెకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించిం ది. మరోవైపు సౌరాష్ట్ర స్టార్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా ఫైనల్లో తేలిపోయాడు. కీలక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఒక్క పరుగు మాత్రమే చేయడం గమనార్హం. టెస్టుల్లో ఆస్ట్రేలియాను వణికించినా పుజారా దేశవాళి క్రికెట్లో మాత్రం ని రాశ పరిచాడు. దీంతో తొలి సారి టైటిల్ దక్కించుకోవాలని భావించిన సౌరాష్ట్ర కలలు ఫలించలేదు. మూడో సారి కూడ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అంతకుముందు 2012 2015 సీజన్స్ లో కూడా ఫైనల్స్‌కు చేరిన సౌరాష్ట్ర టైటిల్ గెలవలేక పోయింది. మరోవైపు వరుసగా రెండో సారి ట్రోఫీని ముద్దాడిన విదర్భ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయం తమకు ప్రత్యేకమని విదర్భ కోచ్ అన్నారు. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన తమకు టైటిల్ నిలబెట్టుకోవ డం కోసం ఒత్తిడికి గురయ్యమని ఆయన చెప్పా రు. కానీ తమ ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారని, కలిసికట్టుగా రాణించడంతో మరో గొప్ప విజయంతో పాటు తిరిగి చాంపియన్‌గా అవతారించామని హర్షం వ్యక్తం చేశారు. గురువారం 58/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్రకు ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్స్ విశ్వరాజ్ జడే జా (52; 137 బంతుల్లో 6 ఫోర్లు), కమ్లేష్ మా క్వనా (14) కొద్ది సేపు బాగనే ఆడినా తర్వాత ప్ర త్యర్థి బౌలర్లు పుంజుకోవడంతో వీరు తమ తమ వికెట్లను కోల్పోయారు. తర్వాతి బ్యాట్స్‌మెన్స్ కూ డా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో సౌరా ష్ట్ర 58.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైపోయింది. విదర్భ బౌలర్లలో ఆదిత్య సర్వతె ఆరు వికె ట్లు పడగొట్టగా.. అక్షయ్ వాఖరె మూడు వికెట్లు దక్కించుకున్నాడు. సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కు ఒక వికెట్ లభించింది.
సంక్షిప్త స్కోర్లు:
విదర్భ తొలి ఇన్నింగ్స్: 312 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 200 ఆలౌట్.
సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 307 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 127 ఆలౌట్.
చాంపియన్ విదర్భ
RELATED ARTICLES