తీర్పు సమీక్ష పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
మహిళలను అనుమతిస్తామన్న దేవస్థానం బోర్డు
మళ్లీ ఆలయ ప్రవేశం చేస్తాం : బిందు, కనకదుర్గ
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సు ప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పుపై 64 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాటిపై రి వ్యూ కోరుతూ పెట్టుకున్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును బుధవారం రిజర్వులో ఉంచింది. ఇదివరలో ఇచ్చిన తీర్పుపై సమీక్ష చేపట్టాలా లేదా అనే దానిపై తన ఉత్తర్వును వినిపిస్తానని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐ దుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వోం బోర్డు, నాయర్ సర్వీస్ సొసైటీ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం విచారించాక ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. సమీక్ష అభ్యర్థన సహా 64 పిటిషన్లను సుప్రీంకోర్టు పరిశీలనలోకి తీసుకుంది. రివ్యూ పిటిషన్‌ను కేరళ ప్రభుత్వం, ట్రా వెన్‌కోర్ దేవస్వోం బోర్డు(టిడిబి), ఆలయంలోకి ప్ర వేశించిన ఇద్దరు మహిళలు వ్యతిరేకించారు. నాయ ర్ సర్వీస్ సొసైటీ వేసిన పిటిషన్‌ను కూడా వారు వ్యతిరేకించారు. నాయర్ సర్వీస్ సొసైటీ తరఫున వాదించిన మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యా యవాది కె. పరాశరన్ రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ తీర్పుపై ఆక్షేపణ తెలిపారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 దేశంలోని అన్ని సెక్యులర్ సంస్థలలోకి మాత్రమే ప్రజలకు తెరచి ఉంచాలని చెబుతోంది. కానీ ఆధ్యాత్మిక సంస్థలను ఆ ఆర్టికల్ విస్మరించింది(కాన్‌స్పిక్యులస్లీ ఒమిట్స్)’ అని ధర్మాసనం ముం దు వాదించారు. తీర్పును పునఃపరిశీలించాలని ఆయన కోరారు. సమాజంలో అంటరాని తనాన్ని గురించి చెప్పిన ఆ ఆర్టికల్‌ను సుప్రీంకోర్టు తన తీర్పులో తప్పుగా ఉపయోగించిందని పేర్కొన్నారు. కులం ఆధారంగా కాక నిర్దిష్ట వయస్సులోపలి మహిళలనే ఆలయంలోకి ప్రవేశించకుండా ఉంచామన్నారు. కేరళ ప్రభుత్వం తరఫున ధర్మాసనం ముందు హాజరైన సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా తన వాదనను న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, ఎఎం ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాతో కూడిన ధర్మాసనం ముందు వినిపించారు. మెజారిటీ తీర్పును వినిపించిన నలుగురు న్యాయమూర్తుల్లో మూడు అంశాలు… ఆర్టికల్ 26,25(2), కేరళ చట్టం రూల్3(బి)పై ఏకాభిప్రాయం ఉందని, అయితే రివ్యూ పిటిషన్లలో ఏదీ ఈ మూడు అంశాలపై ప్రశ్నలను లేవనెత్తలేదని వాదించారు. తీర్పుపై సమీక్షను కోరిన చాలామందిలో వ్యాజ్యపు పాయింట్లపై కాక కేవలం తీర్పు విశ్లేషణపైనే దరఖాస్తు చేశారని అన్నారు. రివ్యూ పిటిషన్‌ను మళ్లీ తెరవొద్దని కేరళ ప్రభుత్వం తరఫున వాదించిన మరో న్యాయమూర్తి విజయ్ హన్సారియా చెప్పారు. ట్రావెన్‌కోర్ దేవస్వోం బోర్డు మాజీ చైర్‌పర్సన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తీర్పుపై రివ్యూకు అనుకూలంగానే మాట్లాడారు.