ప్రేమ తిరస్కరిస్తోందని మెడపై కత్తిపోట్లు
పోలీసుల అదుపులో నిందితుడు భరత్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
ప్రజాపక్షం/అంబర్‌పేట్/సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో మరో ప్రేమోన్మాది రెచ్చి పోయాడు. తన ప్రేమను తిరస్కరిస్తోందని ఓ యువకుడు ఇంటర్ విద్యార్థినిపై కొబ్బరి బోండాల కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో విద్యా ర్థిని మెడ, పొట్ట భాగాలపై గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థినిని హుటా హుటిన మలక్‌పేట యశోద ఆసు పత్రికి తరలించారు. నగరంలో తీవ్ర కళకలం రేపిన సంఘటన వివరాలు పోలీసులు స్థానికుల కథనం ప్రకా రం.. కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరి ధిలోని బర్కత్‌పుర సత్యానగర్‌లో భరత్ అనే యు వకుడు నివసిస్తున్నాడు. అతడు ఓ ప్రైవేటు కళా శాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతు న్నాడు. భరత్ ఇంటి పక్కనే ఓ మైనర్ బాలిక నివ సిస్తుంది. ఆ బాలిక ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్న నేప థ్యంలో ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. ఆ స్నే హాన్ని తప్పుగా అర్థం చేసుకున్న భరత్ తనను ప్రేమించాలని బాలికను వేధించసాగాడు. ఈ వి షయం వారి ఇరువురి కుటుంబ సభ్యులకు తెలి యడంతో బాలిక తలిదండ్రులు నెల రోజుల క్రి తం భరోసా కేంద్రాన్ని ఆశ్రయిం చారు. ఇద్దరిది చిన్న వయసు కావ డంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వది లేయాలని కుటుంబసభ్యులు పోలీ సులను కోరారు. దీంతో భరోసా కేం ద్రంలోని పోలీసులు భరత్‌ను హెచ్చ రించి వదిలేశారు. అప్పటినుండి భరత్ ఆ బాలికను దూరం నుండి గమనిస్తూ ఉండేవాడు. ఒకటి రెండు సార్లు కాలే జీకి వెళ్తున్న సమయంలో వెంబడించాడు. కాలేజి సమీపంలో అటకాయించి పెద్దలకు తెలియ కుండా తనను ప్రేమించమని బలవంతం చేశా డు. అందుకు ఆ బాలిక తిరస్కరించింది. దీంతో భరత్ ఆగ్రహానికి గురయ్యాడు. బుధవారం ఉదయం బాలిక కళాశాలకు వెళ్తున్న సమయంలో భరత్ ఒక్క సారిగా కొబ్బరిబోండాల కత్తితో ఆమెపై దాడికి దిగాడు. మెడపై పొట్టపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడి నుండి కాపాడుకునే ప్రయత్నంలో బాలిక చేతికి కూడా గాయాలయ్యాయి. ఒక్కసారి బాలిక అక్కడ కుప్పకూలి పోవడంతో భరత్ పారిపోయాడు. దాడి ఘటనతోగుమిగూడిన స్థానికులుపోలీసులకు ఫి ర్యాదు చేయడంతో బాధితురాలిని యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.