సంక్షోభాన్ని సృష్టించిన మోడీ, మమత ప్రభుత్వాలు
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అఖిలపక్షాన్ని పిలవాలి
శారదా చిట్‌ఫండ్ అంశంలో రెండు ప్రభుత్వాలు దొందు దొందే
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్: కోల్‌కతాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, పశ్చిమబెంగాల్ లో ని మమతా బెనర్జీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఘర్షనాత్మక ధోరణి రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తోందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. ఈ వ్యవహారం పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఇద్దరికీ కొంత మొ ట్టికాయలు, కొంత ఉపశమనం కలిగించినట్లున్నదన్నారు. శారదా కుంభకోణం విషయంలో రెండు ప్రభుత్వాలు నిందితులను కాపాడుకునే ప్రయత్నా లు చేస్తూ వచ్చాయని అన్నారు. మఖ్దూంభవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సురవరం మాట్లాడారు. ఐదేళ్ల క్రితం శారదా చిట్‌ఫండ్ కుంభకోణంపై విచారణను సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించిందని తెలిపారు. ఈ కుంభకోణంపై సరైన పద్దతిలో విచారణ జరుపకుండా ఈ శాన్యరాష్ట్రాలకు చెందిన బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. రూ.15,500 కోట్లు మింగేసిన ఈ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది ఉన్నారని, ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి వదిలేశారని, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అరెస్టు అయి బిజెపిలో చేరిన తర్వాత అతడ్ని కాపాడేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. ఎన్నికలకు మందు ఇప్పడు పోలీస్ కమిషనర్‌ను అరెస్టు చేసేందుకు సిబిఐ ప్రయత్నించిన విషయాన్ని ఆయనీసందర్భంగా గుర్తు చేశారు. 9 నెలల ముందు చివరి నోటీసు ఇచ్చిన సిబిఐ ఇప్పుడు కమిషనర్‌ను అరెస్టు చేయడానికి రావడం, అక్కడి ముఖ్యమంత్రి అతడిని కాపాడే ప్రయత్నాలు చేయడం,. దీనిని కేంద్రం, రాష్ట్రాల మధ్య ఘర్శణతా, సంక్షోభంగా మార్చే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. చిట్ ఫండ్ కుంభకోణంలో తప్పుచేసిన వారిని కాపాడెందుకు రెండు ప్రభుత్వాలు ప్రయత్నించాయన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్లుపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాయవతి, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, విజయన్ మీద కేసులు పెట్టారని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను, రాజకీయంగా వాడుకుంటున్నారని అన్నారు. కన్హయ్య కుమార్ మీద మూడేళ్ళ తర్వాత పెట్టిన చార్జిశీట్‌ను కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిపై ఛత్తీస్‌ఘడ్‌లో మాజీ ముఖ్యమంత్రిపై సిబిఐ కేసులున్నా విచారణ జరుగడంలేదని అన్నారు. విజయమాల్య, లలిత్‌మోడీ, నీరవ్ మోడీ లాంటి వారు తప్పించుకునేందుకు సహకరించిన వారిపై విచారణ లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. మమత ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.