రోబోలనూ హ్యాక్ చేయవచ్చని నిరూపించిన పరిశోధకులు
వాషింగ్టన్ : పూర్తిస్థాయి ఆపరేషన్స్‌తో పరిశోధనలు జరిపే రోబోలు ఇష్టానుసారంగా ఎన్ని పనులు చేసినా, ఆదేశాల ప్రకారం ఎన్ని పనులు చేసినా అవి అంత భద్రమేమీ కావు. ఎందుకంటే ఇంటర్నెట్‌లో అవి సెక్యూర్డ్‌గా లేవు. హ్యాకర్స్ వాటిని హ్యాక్ చేసేసి తమ ఇష్టానుసారంగా వాటితో పనులు చేయించవచ్చు. పైగా హ్యాకర్లు సమీపం నుంచి వాటిని ఆపరేట్ చేయాల్సిన పనిలేదు. దూరం నుంచే అంటే ఖండాంతరాల నుంచే ఈ రోబోలను ఆపరేట్ చేయగలరు. ఈ యంత్రాలను దూరం నుంచే కమాండ్ చేయవచ్చు. అలాగే కెమెరా ఫీడ్స్‌పై గూఢచర్యం కూడా చేయవచ్చు.
అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా రోబో ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఆర్‌ఓఎస్)పై స్కాన్ చేశారు. రోబోటిక్స్ వేదికపై అత్యంత ప్రజాదరణ పొందిన పరిశోధనగా ఆర్‌ఓఎస్‌ను అభివర్ణిస్తారు. అలాంటి ఆర్‌ఓఎస్‌పై పరిశోధకులు ప్రత్యేకమైన అధ్యయనం నిర్వహించారు. 2017, 2018లలో మూడు భిన్నమైన సమయాల్లో ఈ స్కానింగ్స్ నిర్వహించారు. ఆర్‌ఓఎస్‌ను నడుపుతున్న 100 ఎక్స్‌పోస్‌డ్ సిస్టమ్స్‌ను కనుగొన్నారు. వాటిలో 19 రోబోలు పూర్తిగా ఆపరేషన్స్‌లో వున్నట్లుగా పరిగణించారు. ఈ రోబోలన్నింటినీ చాలా దూరం నుంచి నియంత్రించడానికి సాధ్యమవుతుందని వారు గుర్తించారు. అలాగే కెమెరా ఫీడ్స్‌ను రహస్యంగా దొంగిలించడానికి, ఆ రోబోల కదలికలపై నియంత్రణకు చేయాల్సినవన్నీ దూరం నుంచే చేయవచ్చని తెలిపారు.
ఇప్పటివరకు రోబోలను హ్యాక్ చేయవచ్చని ఎవరూ ఊహించలేదు. కానీ అన్‌సెక్యూర్డ్ రోబోలు ఒక పెద్ద సమస్య కాకపోయినప్పటికీ, మేం నిర్వహించిన అధ్యయనం ప్రకారం చాలా రీసెర్స్ రోబోలను ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయవచ్చు, నియంత్రించవచ్చని పరిశోధకులు తెలిపారు. సహజంగానే రోబోలను తయారుచేసిన వ్యవస్థలు ఇంటర్నెట్‌తో అనుసంధానమై వుంటాయి. అందుకు వీటిని హ్యాక్ చేయడం సులువని పరిశోధకులు చెపుతున్నారు. అనుసంధానమై వున్న డిజిటల్ వరల్డ్‌లో దేన్నయినా హ్యాక్ చేయడం సాధ్యమే అవుతుందని ఇది రుజువుచేస్తున్నది.
హ్యాకింగ్‌కు కాదేదీ అనర్హం!
RELATED ARTICLES