వేగవంతమైన స్పేస్‌క్రాఫ్ట్‌ను సిద్ధం చేస్తున్న నాసా
2022లో తొలి ప్రయోగానికి ఏర్పాట్లు
వాషింగ్టన్ : గ్రహశకలాలు దూసుకువచ్చి భూమిని తాకినప్పుడు భారీ విధ్వంసం జరుగుతున్నది. అలా జరగకుండా దాన్ని కక్ష్యలోనే దారి మళ్లించే ప్రణాళికను నాసా సిద్ధం చేసింది. భూమిని రక్షించేందుకు ఈ ప్రణాళికను ఉపయోగిస్తున్నామని ప్రకటించింది. భవిష్యత్‌లో కిల్లర్ ఆస్టరాయిడ్ దాడుల నుంచి భూమిని ఎలా కాపాడాలన్నదే తమ లక్ష్యమని నాసా తెలిపింది. రిఫ్రిజిరేటర్ పరిణామంలో ఉండే ఒక స్పేస్‌క్రాఫ్ట్ (వాహకనౌక)ను తయారు చేయబోతున్నారు. ఇది బుల్లెట్ కన్నా దాదాపు 9 రెట్లు వేగవంతంగా దూసుకుపోగలదు. దీన్ని స్పేస్‌రాక్ (ఆస్టరాయిడ్)లోకి పంపించడం ద్వారా దాన్ని కక్ష్య నుంచి దారిమళ్లించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. నాసా తొలిసారిగా ఈ తరహా మిషన్‌ను చేపట్టింది. గ్రహ రక్షణ కోసం ఆస్టరాయిడ్ డిఫ్లెక్షన్ టెక్నిక్‌ను ముందుగా ప్రదర్శించాలని భావిస్తున్నది. 2022 అక్టోబరులోనూ, 2024లో రెండు ఆస్టరాయిడ్లు (గ్రహశకలాలు) భూమిని తాకబోతున్నాయి. ఈ రెంటిపై ముందుగా నాసా తన ప్రయోగం నిర్వహించాలని యోచిస్తున్నది. దీనికి డబుల్ ఆస్టరాయిడ్ రిడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) అని పేరుపెట్టారు. అంటే ఈ రెండు ఆస్టరాయిడ్లను దారిమళ్లించే పరీక్ష అని అర్ధం. నాసాకు చెందిన ఈ డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్టుకు సంబంధించిన ఆర్టిస్ట్ కాన్సెప్ట్‌ను నాసా ఆమోదించింది. దీని ప్రకారం డార్ట్ ప్లాన్‌ను తయారు చేస్తారు. కైనెటిక్ ఇంపాక్టర్ టెక్నిక్‌గా పిలిచే డార్ట్ నాసాకు చెందిన ఈ తరహా మొట్టమొదటి మిషన్.
ఆస్టరాయిడ్ కక్ష్యను బదలాయించడానికి ఉద్దేశించిన ఈ పరీక్ష ఒక విధంగా ఆస్టరాయిడ్‌పై దాడిలాంటిదని వాషింగ్టన్లో నాసా ప్రధాన కార్యాలయంలోని ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లే జాన్సన్ తెలిపారు. డిడిమోస్ అనే ఆస్టరాయిడ్ రెండుగా చీలిపోయి భూమివైపు దూసుకువస్తున్నది. ఈ రెండు ఆస్టరాయిడ్ ముక్కల్లో డిడిమోస్ ఎ దాదాపు 780 మీటర్ల పరిమాణంలోనూ, డిడిమోస్ బి దాదాపు 160 మీటర్ల పరిమాణంలో వుంటాయి. ఈ డిడిమోస్ అంటే గ్రీకు భాషలో కవలలు అని అర్థం. రెండుగా చీలి వస్తున్నందున దీనికి ఆ పేరుపెట్టారు. 2022లో ఈ రెండూ భూమిని తాకనున్నాయి. డార్ట్ పరీక్ష కోసం నాసా ఇందులో డిడిమోస్ బిని ఎంచుకున్నది. 2003 నుంచి డిడిమోస్ గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక దశలో ఈ ఆస్టరాయిడ్ ఎస్ ఆకారంలో ఉండేది. ఆ తర్వాత ఇది రెండుగా చీలింది. సరిగా భూకక్ష్యలోకి దూసుకువస్తున్నట్లు నిర్ధారించారు. ఇది మరో మూడేళ్లలో భూమిని తాకుతాయి. ఈలోగానే డార్ట్ రూపకల్పన పరిపూర్తి కావాలన్నది నాసా టార్గెట్.
బుల్లెట్‌కన్నా తొమ్మిది రెట్లు వేగం
RELATED ARTICLES