ఐసిసి వన్డే ర్యాకింగ్స్ విడుదల
దుబాయి : ఐసిసి ప్రకటించిన తాజా వన్డే ర్యాకింగ్స్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో టీమిండియా వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ 122 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ 126 రేటింగ్‌తో తొలి స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. బ్యాట్స్‌మెన్ జాబితాలో భారత సారథి విరాట్ 887 రేటింగ్‌తో తొలి స్థానంలో, తాత్కాలిక సారథి రోహిత్ శర్మ 854రేటింగ్‌తో రెండో స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరిద్దరి తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ మూడో స్థానంలో ఉన్నాడు. పదో స్థానంలో శిఖర్ ధావన్ నిలిచాడు. ఎంఎస్ ధోనీ 17వ స్థానంలో, కేదార్ జాదవ్ ఎనిమిది స్థానాలు మెరుగు పరుచుకుని 35వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. నాలుగో స్థానంలో కుల్‌దీప్ ఉండగా, చాహల్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ 17వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్న మహమ్మద్ షమీ తన స్థానాలను మెరుగు పరుచుకుని 30 స్థానంలో నిలిచాడు.
కోహ్లికి టాప్.. టీమింయాకు సెకండ్
RELATED ARTICLES