కాంగ్రెస్ అవకాశం కల్పించింది
దళితుడిని సిఎల్పి నేతగా ఎంపిక చేసింది
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా టిఆర్ఎస్ పాలన
కాంగ్రెస్ శాసనసభాపక్షనేత భట్టి
గాంధీభవన్‌లో విక్రమార్కకు సన్మానం
హైదరాబాద్: తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కెసిఆర్ మాట తప్పారని, కాని కాంగ్రెస్ మాట ఇవ్వకున్నా దళితునికి సిఎల్పి నేతగా అవకాశం కల్పించిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సిఎల్పి) నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తనపై ఇంత టి బాధ్యతను ఉంచినందుకు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తానన్నారు. సిఎల్పి నేతగా నియమితుడైన సందర్భం గా టిపిసిసి ఒబిసి సెల్ ఆధ్వర్యంలో భట్టికి శనివారం గాంధీభవన్‌లో సన్మానం జరిగింది. ఒబిసి సెల్ చైర్మన్ చిత్తరంజన్‌దాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు బిసి నేతలు హాజరయ్యారు. భట్టిని గజమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కెసిఆర్ పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. పాలన కోసం వాడవలసిన వ్యవస్థను, అధికారంలోకి రా వడం కోసం దుర్వినియోగం చేశారని, అందుకే టిఆర్ఎస్ మరోసారి గెలిచిందన్నారు. మందబలంతో కట్టడి చే యాలని చూడడం వారి వల్ల కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ని ఎవ్వరు ఏమి చేయలేరన్నారు. గడ్డు పరిస్థితులను ఎదుర్కొని చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ బలపడిందని, భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. సా మాజిక తెలంగాణ నిర్మాణం కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణం గా పనిచేస్తానన్నారు. గెలుపు ఓటములు సహజమన్నా రు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి చేయడానికి తన ప్రయత్నం చేస్తామని, సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. బలహీన వర్గాలను గుర్తించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమేనన్నారు. చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు భట్టి విక్రమార్క అని అన్నారు. ఆయనను సి ఎల్పి నేతగా నియమించిన రాహుల్‌గాంధీకి ధన్యవాదా లు తెలిపారు. తనకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లే దని, బిసిలకు టిక్కెట్లు కేటాయించాలని ముందు నుం డి కోరుతున్నానని, అదే మాటపై నిలబడుతానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని,పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేయాలని కోరారు. ఓడిపోయిన వారికే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులు ఇస్తున్నారని, అలా కాకుండా నాయకుల అభిప్రా యం మేరకు ఇన్ఛార్జ్లను నియమించాలన్నారు.అలాగే టిపిసిసి రాష్ట్ర కమిటీలో, పార్టీ కార్యవర్గం లో 40 శాతం పదవులు బిసిలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి.హనుమంతరావు మాట్లాడుతూ విక్రమార్కను ఓడించాలని చాలామంది ప్రయత్నం చేశారని, ఎవరి వల్ల కాలేదన్నారు.అగ్రకుల నాయకులకు సిఎల్పి పదవి ఇచ్చేవారని, ఇప్పుడు రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాలకు చెందిన భట్టి విక్రమార్కకు ఇచ్చారన్నారు. గెలిచిన ఎంఎల్ఎలను కా పాడుకుంటూ భట్టి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పారు. సిఎం కెసిఆర్‌కు మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎంఎల్ఎలను తీసుకోవాలని చూస్తున్నాడని, దానిని అడ్డుకోవాలన్నారు. కాంగ్రెస్ గెలిచిన మూడు రాష్ట్రాలలో కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారినే ముఖ్యమంత్రులను చేశారన్నారు. అగ్రకులాలకు ఇబిసి రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో బిసిలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.రాష్ర్టంలో బిసిలకు రిజర్వేషన్లు తగ్గించడం వల్ల వేలమంది సర్పంచ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిపై ఎక్కువగా వేటు వేస్తున్నారని, ఎస్సి, ఎస్టిలపై చర్యలు తీసుకున్నట్టుగా అం దరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల గెలిచిన 2,700 మంది కాంగ్రెస్ సర్పంచ్‌లకు సన్మానం చేయాలని, వారంతా స్వశక్తి తో గెలిచారన్నారు. పార్టీలో బడు గు బలహీన వర్గాల నేతలు బాధ పడుతున్నారని, అందరికీ న్యాయం చేయాలన్నారు.
సమావేశంలో ఘర్షణ
ఇదిలా ఉండగా సన్మాన కార్యక్రమానికి హాజరైన కాంగ్రె స్ నేతలు వి.హనుమంతరావు (విహెచ్), హైదరాబాద్ నగర ఒబిసి సెల్ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ వర్గాల మ ధ్య ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగా యి. ఈ క్రమంలో కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో శ్రీకాంత్‌కు అంబర్‌పేట టిక్కెట్ రాకుండా విహెచ్ అడ్డుకున్నారని ఆయన వర్గీయులు విహెచ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భట్టి విక్రమార్క చూస్తుండగానే విహెచ్, శ్రీకాంత్ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడటం గమనార్హం. అనంతరం శ్రీకాంత్‌ను ఒబిసి సెల్ హైదరాబాద్ అధ్యక్ష పదవి నుండి తొలగిస్తూ ఒబిసి సెల్ రాష్ట్ర చైర్మన్ చిత్తరంజన్ దాస్ ఉత్తరువులు జారీ చేశారు.
కెసిఆర్ మాట తప్పారు..
RELATED ARTICLES