ముంబాయి: ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా సిద్ధంగా ఉందని భారత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అంటున్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రపంచకప్ దృశ్య టీమిండియాలో ప్రయేగాలు చేస్తున్నామన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో పూర్తి స్కాడ్లను ఆడిస్తున్నాం. ఇప్పటికే టీమిండియా దాదాపు కూర్పు ఖాయమైపోయింది. చాలామంది క్రికెటర్లు తమ అంచనాలకు తగ్గట్టు గొప్పగా ఆడుతున్నారు. సీనియర్లతో పాటు కొందరూ యువ ఆటగాళ్లకు కూడా జట్టులో అవకాశాలు ఇస్తున్నాం. ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ భారత్ సత్తా చాటుకొంటుంది. అందరూ కలిసి కట్టుగా రాణిస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ఆట అద్భుతం. విదేశాల్లో సాధ్యం కానీ రికార్డులను భారత్ సాధిస్తోంది. విజయాల్లో భారత సారథి విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి పాత్ర కీలకం. వీరిద్దరూ మంచి నిర్ణయాలు టీమిండియాకు కలిసొన్తున్నాయి. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి భారత జట్టులో గొప్ప క్రికెటర్లు వస్తున్నారు. తమ అపారమైన ప్రతిభతో గొప్ప విజయాలు అందించే సత్తా వీరికి ఉంది. తమ సెలెక్షన్ టీమ్ ఎల్లప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెటర్లపై దృష్టి ఉంచుతున్నామని ఎమ్మెస్కే అన్నారు. అక్కడి నుంచే భారత జట్టులో ప్రతిభవంతులైన యువ ఆటగాళ్లు వస్తున్నారు. భారత్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి మంచి ఆధారణ ఉండడం తమకు కలిసి వస్తుందని అన్నారు. ఇప్పుడు జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. ఎవరినీ తీసుకోవాలో ఎవరినీ తీసుకోకూడదో తెల్చుకోవడం కష్టంగా మారింది. అందరూ అద్భుతంగా రాణిస్తున్నారు. అందుకే తమ పని ఇంకా కఠినంగా మారింది. ప్రస్తుతం టీమిండియా ప్రపంచ అగ్రజట్లలో ఒకటి. అన్ని ఫార్మాట్లలో భారత్ మెరుగ్గా రాణిస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో టీమిండియా హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతుందని టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు.
టీమిండియా పటిష్టంగా ఉంది: ఎమ్మెస్కే ప్రసాద్
RELATED ARTICLES