మోడీ పదవి దిగిపోవలసిన సమయం ఆసన్నమైంది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ పదవి నుంచి దిగిపోవలసిన స మయం ఆసన్నమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య 45 ఏళ్లలో అ త్యధికంగా 2017-18 కాలంలో నమోదైందని జాతీయ నమూ నా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) నివేదిక వివరాలను ప్రస్తావిస్తూ.. ‘మోదీ ఇచ్చిన ఉద్యోగాల కల్పన హామీ ఏమైంది?’ అని ప్రశ్నించారు. ‘నమో జాబ్స్.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఓ నిరంకుశ నేత హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచాయి. ఉద్యోగాల విషయంలో బయటకు వచ్చిన ఈ నివేదిక ఓ జాతీయ విపత్తు వంటి పరిస్థితిని సూచిస్తోంది. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధికంగా నిరుద్యోగం ఉంది. 6.5 కోట్ల మంది యువత 2017-18 కాలంలో నిరుద్యోగులుగా మిగిలారు. నమో ఇక వెళ్లు అనాల్సిన సమయం వచ్చింది’ అని రాహుల్‌గాంధీ ట్విటర్లో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా ట్విటర్లో‘మోదీజీ.. ఇప్పుడు నిరుద్యోగ రేటు.. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధికంగా ఉన్నట్లు నమోదైంది. అందుకే ఎన్‌ఎస్‌ఎస్‌ఒ నివేదికను బయటకు రాకుండా ఇన్ని రోజులు దాచారు. అందుకే, జాతీయ గణాంక సంఘం (ఎన్ఎస్సి) సభ్యులు రాజీనామా చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ ఇప్పుడు ఓ క్రూరమైన జోక్‌గా మారిపోయింది. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసే ప్రభుత్వం భారత్‌కు వద్దు’ అని విమర్శలు గుప్పించారు. ఎన్ఎస్సి నుంచి ఇద్దరు స్వతంత్ర సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొన్ని అంశాల్లో ప్రభుత్వంతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ సంస్థ తాత్కాలిక ఛైర్పర్సన్ పిసి మోహనన్, జెవి మీనాక్షి రాజీనామా చేశారు.