హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌ను 3 మ్యాచ్‌లు గెలిసి ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నాలుగో వన్డేలో బోల్తా పడింది. కివీస్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వని భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 30.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. ధావన్(13),పాండ్యా(16) చహల్(18 నాటౌట్), కుల్దీప్(15)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్(9) కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. 93 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. కాగా, తొమ్మిదేళ్ల అనంతరం అత్యల్ప స్కోర్‌కు ఆలౌటై చెత్త రికార్డును నెలకొల్పింది. అది కూడా 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్(88) పైనే ఈ రికార్డు ఉంది. కాగా, న్యూజిలాండ్‌లో భారత్‌కు ఇదే అత‍్యల్ప స్కోరు. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్(5/21), గ్రాండ్ హోమ్(3/26) పదునైన బౌలింగ్‌కు భారత బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు.
టీమిండియా ఘోర పరాజయం
RELATED ARTICLES