HomeNewsBreaking Newsగెలుపే లక్ష్యంగా..

గెలుపే లక్ష్యంగా..

మరో విజయంపై కన్నేసిన టీమిండియా
నేడు కివీస్‌తో నాలుగో వన్డే
ఉదయయం 7:30 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం
హామిల్టన్‌: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో విజయంపై కన్నేసింది. ఇప్పటికే 3 సిరీస్‌ను గెలుచుకున్న భారత్‌ ఇక నాలుగో వన్డేలోనూ విజయమే లక్ష్యంగా బరిలో దిగుతోంది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై చిత్తుగా ఓడిస్తూ ఆకట్టుకొంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత సారథి విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి నిచ్చారు. ఈ విషయాన్ని బిసిసి ముందే తెలిపింది. కివీస్‌తో ఆఖరి రెండు వన్డేలతో పాటు అనంతరం జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ల నుంచి కోహ్లీకి విశ్రాంతినిస్తున్నట్టు గతంలో బిసిసిఐ ప్రకటించింది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని కోహ్లీకి విశ్రాంతి కలిపించారు. ఇంతకు ముందు జట్టు ప్రధాన బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను కూడా విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అతని స్థానంలో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపడున్నాడు. కోహ్లీ లేని భారత జట్టును తక్కువ అంచనా వేయలేం. ప్రస్తుతం టీమిండియాలో ప్రతొక్కరి మెరుగ్గా రాణిస్తున్నారు. ఏ ఒకరి వల్లే గెలుస్తున్నామట్టులేదు. అందరూ కలిసికట్టుగా రాణిస్తున్నారు. బ్యాట్స్‌మెన్స్‌తో పాటు బౌలర్లు కూడా అద్భుతంగా పోరాటప్రతీమను కనబర్చుతున్నారు. ఆస్ట్రేలియాను వారి సొంత మైదానాల్లో నిలువరించిన భారత జట్టు ఇప్పుడు న్యూజిలాండ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ధావన్‌ తిరిగి ఫామ్‌లో రావడం భారత్‌కు కలిసి వస్తోంది. ధావన్‌ తన ధానాధన్‌ ఇన్నింగ్స్‌తో ప్రత్య ర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మరోవైపు హార్డ్‌ హిట్టర్‌ రోహిత్‌ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
శుభ్‌మాన్‌కు చాన్స్‌..?
ఇక కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్‌ శుభ్‌మాన్‌ గిల్‌కు అవకాశం ఇస్తున్నట్టు సమాచారం. గత ఏడాది జరిగిన అండర్‌ వరల్డ్‌ కప్‌లో భాతర్‌ విజేతగా నిలిచింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన శుభ్‌మాన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు. అనంతర ం భారత్‌ తరఫున మ్యాచ్‌లు ఆడి తన సత్తా చాటుకున్నాడు. నిలకడగా ఆడడంతో భారత సెలెక్టర్లు ఈ యువ ఆటగాడిని న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపిక చేశారు. తొలి మూడు వన్డేల్లో అవకాశం లభించకపోయినా ఇప్పుడు కోహ్లీ బదులుగా ఇతనికి చాన్స్‌ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భారత మాజీలు కూడా ప్రపంచకప్‌ దృశ్య శుభ్‌మాన్‌కు ఒక అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇటీవలే భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ కూడా కోహ్లీ స్థానంలో శుభ్‌మాన్‌ను ఆడించాలని పేర్కొన్నాడు. ఇక గత మ్యాచ్‌లో గాయం కారణంగా దూరమైన సీనియర్‌ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీ గురువారం జరిగే నాలుగో వన్డేలో తిరిగి జట్టులో వస్తాడోలేదో చూడాలి. కోహ్లీ, ధోనీ ఇద్దరూ లేకుంటే భారత జట్టు కాస్త బలహీనంగా ఉంటుందని అందరి అంచనా. కోహ్లే లేకున్న ధోనీ తన అనుభవంతో జట్టును ముందుకు నడిపించగలడు. ఈ రోజు టాస్‌ సమయానికే ధోనీ జట్టులో ఉన్నాడో లేదో తెలుస్తోంది. ఇక మిడిల్‌ ఆర్డర్‌లో హైదరాబాద్‌ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు నిలకడగా ఆడుతున్నాడు. అతను కివీస్‌ పర్యటనలో మెరుగ్గా ఆడుతూ మిడిల్‌ ఓవర్లలో భారత్‌ను ఆదుకొంటున్నాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌ వచ్చి మ్యాచ్‌ చివరి వరకు క్రీజులో నిల్చొంటున్నాడు. మరోవైపు కేదర్‌ జాదవ్‌కు లభించిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగ పరుచుకున్నాడు. ఆఖరి ఓవర్లలో అవకాశం లభించిన ధాటిగా ఆడి భారత్‌కు మంచి స్కోరును అందిస్తున్నాడు. స్పిన్నర్లు, పేసర్లు తేడాలేకుండా అందనిపై విరుచుకుపడుతున్నాడు. వేగంగా పరుగులు చేసి జట్టుకు అండగా నిలిస్తున్నాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే అందరూ అద్భుతంగా రాణిస్తున్నారు. మొదట పేసర్లు విజృంభిస్తే తర్వాత స్పిన్నర్లు తమ పనిని కానిస్తున్నారు. ప్రత్యర్థి జట్టు పెద్ద భాగస్వామ్యాలు చేయకుండా సమర్థంగా అడ్డుకొంటున్నారు. పటిష్టమైన కివీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను వణికిస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ తమ ప్రతపాన్ని చూయించేందుకు భారత బౌలర్లు సిద్ధమయ్యారు.
52 ఏళ్ల రికార్డును చెరిపెస్తారా..
కివీస్‌గడ్డపై వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా ఇప్పుడు మరో అరుదైన రికార్డుకు చేరువైంది. దాదాపు 52 ఏళ్లుగా న్యూజిలాండ్‌ గడ్డపై పర్యటిస్తున్న భారత్‌ ఇప్పటి వరకు 4 సిరీస్‌ను గెలవలేదు. 1967లో తొలిసారి కివీస్‌ పర్యటనకు వెళ్లిన భారత్‌ దాదాపు చాలా కాలం తర్వాత 2008 పర్యటనలో 3 సిరీస్‌ను గెలిచింది. భారత్‌ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కానీ ఇప్పుడు మరో కొత్త చరిత్ర సృష్టించేందుకు భారత్‌ ముందు మంచి అవకాశం ఉంది. వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌ ఇప్పుడు ఆ రికార్డును అధిగమించేందుకు తహతహలాడుతోంది. ఇటీవలే ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్టు సిరీస్‌ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా ఇప్పుడు కివీస్‌లో సైతం కొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఆసీస్‌ గడ్డపై 72 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3 గెలుచుకున్న భారత్‌ నాలుగో వన్డేలోసైతం గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్నది. మరోవైపు క్రికెట్‌ విశ్లేషకులు ఈ సారి టీమిండియా 5 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని జోస్యం చెబుతున్నారు. ఏది ఏమైన చివరి రెండు వన్డేల్లో ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కొత్త చరిత్ర నమోదవుతోంది.
రోహిత్‌ 200వ వన్డే..
గురువారం జరిగే మ్యాచ్‌తో భారత హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ తన కెరీర్‌ 200వ అంతర్జాతీయ వన్డే ఆడనున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన రోహిత్‌ శర్మ జట్టులో కీలక సభ్యుడు. ప్రతి మ్యాచ్‌లో ఇతనిపై భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకొంటుంది. దాదాపు చాలా మ్యాచుల్లో తన బ్యాట్‌ను ఝుళపిస్తూ ఒంటి చేత్తో ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. విరేంద్ర సెహ్వాగ్‌ రిటైర్మెంట్‌ తర్వాత దూకుడుగా ఆడే ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ ముందుకువచ్చాడు. తనలోని టాలెంట్‌ను ప్రపంచానికి చూపెట్టాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే ధాటిగా ఆడడమే ఇతని నైజం. ఇతను క్రీజులో ఉన్నంత సేపు స్కోరుబోర్డుపై పరుగుల వరద పారడం ఖాయం. తన బలమైన షాట్లతో ‘హిట్‌ మ్యాన్‌’గా పేరుసంపాదించుకున్నాడు. మరోవైపు వన్డేల్లో అత్యధికంగా మూడు డబుల్‌ సంచరీలు సాధించి ఏకైక క్రికెటర్‌గా కూడా రోహిత్‌ రికార్డుల్లో కెక్కాడు. వన్డేల్లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ (264) పరుగులు మొదటి స్థానంలో ఉన్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ మేటి ఆటగాళ్ల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. ఇక విరాట్‌ కోహ్లీ స్థానంలో టీమిండియా తాత్కాలిక సారథిగా రోహిత్‌ బాధ్యతలు చేపడుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్‌ భారత్‌కు గొప్ప విజయాలు అందించాడు. సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌గా పేరుసంపాదించాడు. ఇతను కెప్టెన్‌గా వ్యవహరించిన అన్ని సిరీస్‌లలో భారత్‌ విజయాలు సాధించింది. అందుకే రోహిత్‌కు సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా మంచి పేరుంది. న్యూజిలాండ్‌తో జరిగే ఆఖరి రెండు వన్డేలతో పాటు అనంతరం జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లోనూ రోహిత్‌ కెప్ట్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. గురువారం కివీస్‌తో జరిగే నాలుగో వన్డేలోనూ టీమిండియా విజయం సాధిస్తుందని రోహిత్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుందని రోహిత్‌ అన్నాడు.
పరువు కోసం కివీస్‌..
వరుస ఓటములతో ఘోర అప్రతిష్టను మూటగట్టుకున్న న్యూజిలాండ్‌ మిగిలిన రెండు వన్డేల్లోనైనా విజయాలు సాధించి తమ పరువును నిలబెట్టుకోవాలని చూస్తోంది. భారత బౌలర్ల ముందు కివీస్‌ బ్యాట్స్‌మెన్స్‌ ఘోరంగా విఫలమవుతున్నారు. కెప్టెన్‌ విలియమ్సన్‌, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్‌ తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. ఇక్కడ భారత జట్టు పర్యటించముందు కివీస్‌ బలమైన జట్టుగా నిలిచింది. శ్రీలంకను అన్ని ఫార్మాట్లలో చిత్తు చేసి జోరును కనబర్చింది. కానీ ఇప్పుడు టీమిండియా దూకుడు ముందు కివీస్‌ జట్టు తేలిపోయింది. తమ పేలవమైన ప్రదర్శనలతో ఇటు మాజీలు, అటు అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రపంచకప్‌కు ముందు ఇలాంటి ప్రదర్శనలు చేయడం ఎవరూ జీర్ణించుకోవడంలేదు. స్వదేశంలో మంచి రికార్డులున్న న్యూజిలాండ్‌ మొదటిసారి తమ అంచనాలను అందుకోలేక పోతుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ కివీస్‌ బలహీనంగా మారింది. భారత్‌ను ఏదశలోనూ ఎదురుకొనలేక పోతుంది. మరోవైపు టీమిండియా ఏకపక్షంగా మ్యాచ్‌లను నెగ్గుతుంటే కివీస్‌ జట్టు కనీస పోటీని ఇవ్వకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. ఇక గురువారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టులో విరాట్‌ కోహ్లీ లేకపోవడం కివీస్‌కు కలిసి వచ్చే అంశం. గాయంతో బాధపడుతున్న ధోనీ కూడా అందుబాటులో ఉంటాడో లేడో కచ్చితంగా చెప్పలేం. ఈరెండు అంశాలు న్యూజిలాండ్‌కు ప్లస్‌ పాయింట్లు. వాటిని ఆతిథ్య జట్టు ఎంతవరకు సద్వినియోగ పరుచుకుంటుందో చూడాలి. గురువారం జరిగే నాలుగో వన్డేలో భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని విలియమ్సన్‌ సేన భావిస్తోంది. మరోవైపు వరుసగా నాలుగో మ్యాచ్‌ను నెగ్గి కొత్త చరిత్ర సృష్టించాలని టీమిండియా దృఢ సంకల్పంతో మైదానంలో అడుగుపెడుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments