నేడు న్యూజిలాండ్‌తో మూడో వన్డే
ఉదయం 7:30 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం
మౌంట్ మాంగనూయి: వరుస విజయాలతో తమ జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు ఇక సిరీస్‌పై కన్నేసింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లను గె లుచుకున్న టీమిండియా ఇప్పుడు మూడో వన్డేపై దృష్టి సారించింది. సోమవారం జరిగే మూడో మ్యాచ్‌లోనూ కివీస్‌ను ఓడించి సిరీస్‌ను దక్కించుకోవాలని భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ ఎలాగైన ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో నిలువాలని చూస్తోంది. ఇక భారత సారథి వి రాట్ కోహ్లీకి సిరీస్‌లో ఈ మ్యాచ్ చివరిది. మూడో వన్డే తర్వాత అతనికి విశ్రాంతి నిచ్చిన విషయం తెలసిందే. చివరి రెండు వన్డేలు, ఆ తర్వాత జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉండడు. ఈ మ్యాచ్‌లకు రోహిత్ శర్మ సార థ్యం వహించనున్నాడు. అందుకే మూడో వన్డేలోనే భారత్ సిరీస్‌ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. టీమిండియా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టు కొంటుంది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించిన కోహ్లీ సేన ఇప్పుడు కివీస్‌ను ఆటాడుకొంటుంది. తొలి రెండు వన్డేల్లో పటిష్టమైన కివీస్‌ను చిత్తుగా ఓడించి తమ సత్తా చాటుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ భారత జట్టు బలంగా ఉంది. తొలి వన్డేలో మొదట బౌలింగ్ చేసిన భారత్ కివీస్‌ను 157 పరుగులకే కట్టడి చేసిం ది. ఆ మ్యాచ్‌లో 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. తర్వాత జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో కివీస్‌ను 234 పరుగులకే క ట్టడి చేసి 90 పరుగులతో మరో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2 ఆధిక్యం సాధించింది. టీమిండియా ఓ పెనర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ, శి ఖర్ ధావన్ రెండో మ్యాచుల్లోనూ తమ సత్తా చాటా రు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నిలకడగా ఆడుతున్నాడు. మధ్య ఓవర్లలో ధాటిగా ఆడుతూ రన్‌రెట్ తగ్గకుండా చూసుకొంటున్నాడు. సెకండ్ డౌన్ అంబటి రాయుడు పర్వాలేదని పించాడు. ఆచితూ చి ఆడుతూ జట్టుకు అండగా ఉంటున్నాడు. లో యర్ ఆర్డర్లో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతంగా ఆడుతున్నాడు. తనపై వచ్చిన విమర్శలు చేసిన వారి నోర్లను తన బ్యాటింగ్‌తో ము యించాడు. ప్రపంచకప్‌కు ముందు ధోనీ తన లయ లో తిరిగి రావడం టీమిండియాకు కలిసొచ్చే అం శం. వరుసగా ఐదు వన్డేల్లోనూ ధోనీ గొప్పగా బ్యా టింగ్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యా చ్ల వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. తాజా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ 33 బంతుల్లోనే 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక మరో బ్యాట్స్‌మన్ కేదర్ జాదవ్ కూడా విరోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నా డు. తనకు లభించిన తక్కువ బంతులనే బౌండరీలుగా మార్చుతూ ప్రత్యర్థి జట్టుకి భారీ టార్గెట్ నిర్ధేశించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక బౌ లింగ్ విషయానికొస్తే భారత జట్టు ప్రపంచ టాప్ క్లాస్ బౌలర్లతో పటిష్టంగా ఉంది. ఒకరికి మించి మరొకరూ మంచి ప్రదర్శనలు చేస్తున్నారు. పేసర్ల తో పాటు స్పిన్నర్లు సైతం విజృంభిస్తున్నారు. వీరి ధాటికి ప్రత్యర్థి జట్లు విలవిలలాడుతున్నాయి. పటిష్టమైన న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్‌ను తొలి రెం డు వన్డేల్లోనూ వీరు తక్కువ స్కోరుకే పరిమితం చేసి భారత్‌కు గొప్ప విజయాలు అందించారు. ఇక న్యూ జిలాండ్ జట్టు నిలకడమైన టీమిండియా ప్రదర్శనల ముందు తేలిపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెం డు విభగాల్లోనూ కివీస్ జట్టు పేలవమైన ఆటను కనబర్చుతోంది. ఈ సారైన భారత్‌ను ఓడించి సిరీస్‌లో నిలువాలని కివీస్ జట్టు భావిస్తోంది.
సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
RELATED ARTICLES